
చినబాబు కోసం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ మొదటికే మోసం వచ్చేలా తయారైంది. ఎన్నో ఏళ్లుగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న చాలా మంది ఎమ్మెల్యేలకు చివరకే నిరాశే మిగిలింది. ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన నేతలకే సింహ భాగం మంత్రి పదవులు దక్కడంతో టీడీపీ సీనియర్ నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది.
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తనకు చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశారు. ఆయనకు మద్దతుగా రాజమండ్రిలో చాలా మంది తమ్ముళ్లు కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
టీడీపీ నగర అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు తో పాటు కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా గోరంట్ల కు మద్దతుగా రాజీనామాలు చేశారు.
చంద్రబాబు కోటరీ ఎన్ని బుజ్జగింపులు చేసినా గోరంట్ల ఇంకా పట్టువీడటం లేదు. ఆయనకు మద్దతుగా రాజమండ్రి లో తమ్ముళ్లు అందరూ రాజీనామా బాట పట్టడంతో నగరంలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది.