
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Cahndrababu Naidu) చట్టసభలను గౌరవించే వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ అంతానికి నాందిపలుకుతాయని విమర్శించారు. చట్టసభలను అమితంగా గౌరవించే చంద్రబాబు.. సభలోకి రాను అన్నాడంటే వైసీపీదుర్మార్గులు ఆయన్నిఎంత బాధ పెట్టారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసు వ్యవహారం సీఎం జగన్ (CM Jagan) మెడకు చుట్టుకోబోతోందన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతమై, తన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని భావించే ముఖ్యమంత్రి అసెంబ్లీలో దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు.
YCP ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతను దూషిస్తుంటే.. విలన్‌లా జగన్ ఆనందిస్తాడా? అని మండిపడ్డారు. వెకిలినవ్వు లు నవ్వుతాడా? సభపై గౌరవం ఉన్నవారుఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న జగన్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. . అహంకారంతో సొంత తండ్రి చెంపఛెళ్లుమనిపించిన దుర్మార్గుడు... తల్లిని, చెల్లిని రాజకీయాలకు వాడుకొని వదిలేశాడంటూ విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వర్షం ధాటికి ప్రజలంతా నిరాశ్రయులై, ప్రాణాలను కోల్పోతే దాని గురించి పట్టించుకోలేదని అన్నారు. వరదవల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలనే ఆలోచన చేయకుండా.. చంద్రబాబును క్షోభపెట్టడానికి తన సమయా న్ని ముఖ్యమంత్రి వెచ్చిస్తున్నాడని ఆరోపించారు. దేవతలాంటి భువనేశ్వరిని అవమానించినందుకు, జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్ర మహిళలందరికీ బహిరంగ క్షమాపణచెప్పాలని డిమాండ్ చేశారు. Cahndrababu Naidu అసెంబ్లీ అడుగుపెట్టననే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
‘ఈ వెకిలినవ్వులు, ఈ దుర్మార్గాలు ఇంకా కొద్దికాలమే. వైసీపీప్రభుత్వ పతనం ఆరంభమైంది. ఎవరైతే దుర్మార్గాలు, దోపిడీలు చేస్తున్నారో వారిని శిక్షించే తీరుతాం. మంత్రిపద వులు కాపాడుకోవడానికి మంత్రి పదవి పొందడానికి వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తుంటే, ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకుంటాడా?. రాష్ట్రాన్నిఅప్పులపాలుచేస, ప్రజలను అథోగతి పాలుచేసిన జగన్‌మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిస్థానంలో కొనసాగే అర్హతలేదు. అహంకారంతో సొంత తండ్రి చెంపఛెళ్లు మనిపించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని రాజకీయాలకు వాడుకొని వదిలేశాడు. అలాంటి మూర్ఖుడికి చట్టసభలంటే గౌరవం లేదు. ప్రజలంటే గౌరవం భయంలేవు. ధరలుపెరిగి ప్రజలు అవస్థలుపడుతుంటే, రైతులువిలపిస్తుంటే.. ముఖ్యమంత్రికి అవేవీ పట్టడంలేదు. వచ్చేఎన్నికల్లో ప్రజలు దుర్మార్గులను రాష్ట్రం నుంచి తరిమికొట్టి, అభివృద్ధి ప్రధాత అయిన చంద్రబాబుకి పట్టం కట్టడం ఖాయం. టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జగన్మోహన్ రెడ్డి, ఆయన తాబేదార్ల సంగతేంటో చూస్తాం’ అని జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు.