కరెంటే కాదు బిల్లు ముట్టుకున్నా షాక్... ఇదీ వైసిపి అందించే పాలన..: గోరంట్ల ఎద్దేవా

By Arun Kumar PFirst Published Oct 6, 2021, 3:27 PM IST
Highlights

వైసిపి పాలనతో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని... కరెంట్ తాకితే కాదు బిల్లు చూసినా సామాన్యులకు షాక్ తగులుతోందని ఎమ్మెల్యే గోరంట్ల ఎద్దేవా చేశారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రెండున్నరేళ్లలోనే  ఐదుసార్లు  కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్దమయ్యారని TDP నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి ప్రభుత్వంపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సెటైర్లు విసిరారు.  

''గిరా..గిరా..ఫ్యాను తిరిగితే బరా..బరా..పేలుతోంది కరెంట్ బిల్లు. జనం గుండె గుబిల్లుమంటోంది. వైసీపీ పాలనలో కరెంటే కాదు బిల్లు ముట్టుకున్నా షాక్ కొడుతోంది. ఉక్కపోత ఉంది అని ఫ్యాను వేస్తే బిల్లు చూసి హాస్పిటల్ ఖర్చులు పెరిగేలా ఉన్నాయి జనాలకి వైఎస్ జగన్'' అని గోరంట్ల ఎద్దేవా చేశారు.  

''ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర కాదు ముఖ్యమంత్రి జగన్ గారు. మీ 'యాపారం' తర్వాత చేద్దురు... ముందు పెరుగుతున్న డెంగీ, వైరల్ జ్వరాలపై దృష్టి పెట్టండి. లేదంటే ఆంధ్ర 'ఫినిష్' అయ్యేలా ఉంది'' అంటూ ఎమ్మెల్యే gorantla butchaiah choudary ట్విట్టర్ వేదికన మండిపడ్డారు. 

READ MORE  సామూహిక ఆత్మహత్యలే దిక్కా... ఇదీ అనంతపురం అన్నదాతల దుస్థితి: లోకేష్ సీరియస్ (వీడియో)

ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు విడతల కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగుతూ చెప్పాడు జగన్ అని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మాట తప్పి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే  ఐదుసార్లు  కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్దమయ్యారని మాజీ మంత్రికళా మండిపడ్డారు. 

''వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలన, అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు ఇళ్లల్లో గుడ్డి దీపాలు వాడుతున్నారు. విద్యుత్ వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గతంలో వంద రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. ఉన్నదంతా ఊడ్చి బిల్లులు కడితే మహిళలు ఏ విధంగా సంసారాలు నడుపుకోవాలి'' అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు.
 

click me!