'నా పాత మిత్రుడే,పరిశీలిస్తా': స్పీకర్ తమ్మినేనితో గంటా భేటీ

By narsimha lode  |  First Published Mar 25, 2021, 2:49 PM IST

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  గురువారం నాడు భేటీ అయ్యారు.
 



అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  గురువారం నాడు భేటీ అయ్యారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని  జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ కు విశాఖలో అందించారు. ఈ రాజీనామా పత్రం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి పంపారు జర్నలిస్ట్ ఫోరం నేతలు.

Latest Videos

undefined

గురువారం నాడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను గంటా శ్రీనివాసరావు కలిశారు. స్పీకర్ ఫార్మెట్ లో పంపిన తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరేందుకు తాను స్పీకర్ ను కోరినట్టుగా చెప్పారు. 

ఉప ఎన్నికలు జరిగితే తాను పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నేతలు నిర్ణయించిన అభ్యర్ధి గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

గంటా శ్రీనివాసరావు తన పాత మిత్రుడని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావును తనను కోరారన్నారు.గతంలో గంటా శ్రీనివాసరావు పంపిన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మెట్ లో లేదన్నారు. అయితే మరోసారి స్పీకర్ ఫార్మెట్ లో గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను పంపారన్నారు.ఈ లేఖను పరిశీలించనున్నట్టుగా ఆయన చెప్పారు. తామిద్దరం టీడీపీ, పీఆర్పీలో కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

click me!