వైసీపీలోకి గంటా: ఆ డేట్స్‌ కాదు.. ఇప్పుడు ఇదే ఫైనల్ అట

Siva Kodati |  
Published : Aug 04, 2020, 02:19 PM IST
వైసీపీలోకి గంటా: ఆ డేట్స్‌ కాదు.. ఇప్పుడు ఇదే ఫైనల్ అట

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ తేదీన వైసీపీ కండువా కప్పుకుంటారో అన్న దానిపై క్లారిటీ రాలేదు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ తేదీన వైసీపీ కండువా కప్పుకుంటారో అన్న దానిపై క్లారిటీ రాలేదు.

తొలుత ఆగస్టు 15 అని. ఆ తర్వాత 9న అన్న ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 16వ తేదీని ఫిక్స్ చేశారు. ఆ రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ మాజీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:చంద్రబాబుకు షాక్: వైసీపిలో గంటా శ్రీనివాస రావు చేరికకు ముహూర్తం ఖరారు

ప్రస్తుతానికి వైసీపీ మద్ధతుదారుడిగా గంటా కొనసాగుతుండగా.. ఆయన వర్గానికి చెందిన నేతలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. కాగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ బోర్డు ఛైర్మన్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు చెబుతున్నారు.

ఇందులో ఎంత వరకు నిజం వుందో తెలియదు కానీ ఆ రకమైన ప్రచారం మాత్రం సాగుతోంది. రాష్ట్ర సమతుల అభివృద్ధికి ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu