టీడీపీ నుంచి వైదొలుగుతా: ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Feb 20, 2019, 6:49 PM IST
Highlights

తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రతిపక్షాలు కుట్ర చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరులో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. తాను దళిత పక్షపాతినని చెప్పుకొచ్చారు. దళిత పక్షపాతి అయిన తనను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

ఏలూరు: తెలుగుదేశం పార్టీకి తన వల్ల చెడ్డపేరు వస్తోందంటే పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రతిపక్షాలు కుట్ర చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరులో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. తాను దళిత పక్షపాతినని చెప్పుకొచ్చారు. దళిత పక్షపాతి అయిన తనను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

తన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందంటే తాను పార్టీ వీడతానన్నారు. త్వరలో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. మరోవైపు దళితులంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను ఏ ఒక్క దళిత వ్యక్తీ బాధపడేలా మాట్లాడలేదని..తన వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఆరోపించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారు, అతడ్ని సస్పెండ్ చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్

దళితులపై వ్యాఖ్యలు చింతమనేని స్పందన, వైసీపీ కుట్రే

దళితులపై నోరు పారేసుకున్న చింతమనేని (వీడియో)

click me!