
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన కవాతు ఎందుకు అని ప్రశ్నించారు. కవాతు ఎందుకుక నిర్వహిస్తున్నారో ఎవరికి తెలియదని చెప్పుకొచ్చారు.
తిత్లీ తుఫాన్ ప్రభావంతో సర్వం కోల్పోయి శ్రీకాకుళం జిల్లా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని వారిని పరామర్శించడానికి మాత్రం పవన్ వెళ్లరన్నారు. కవాతును వాయిదా వేసుకుని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్యటించొచ్చు కదా అంటూ సూచించారు. పవన్ కళ్యాణ్ కవాతు కోసం చేసిన ఖర్చులో సగం అయినా తిత్లీ తుఫాన్ బాధితులకు సహాయార్థం ఇవ్వాల్సిందని హితవు పలికారు.