టీడీపీ అధికారంలోకి రాకపోతే రాజకీయాలకు గుడ్‌బై: ఆలపాటి

Published : Jan 21, 2019, 07:10 PM IST
టీడీపీ అధికారంలోకి రాకపోతే  రాజకీయాలకు గుడ్‌బై: ఆలపాటి

సారాంశం

వచ్చే ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంచలన ప్రకటన చేశారు.

గుంటూరు: వచ్చే ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంచలన ప్రకటన చేశారు.

సోమవారం నాడు ఆయన గుంటూరులో  మీడియాతో మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ నాయకుడిగా కాకుండా దిగజారుడుగా మాట్లాడారని  ఆయన మండిపడ్డారు. నీతి నిజాయితీలు లేని వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడే విధానం మార్చుకోవాలని కోరారు.  చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ చేస్తున్నవారికి తాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నట్టు ఆలపాటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ అధికారంలోకి రాకపోతే  తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?