రాజ్యసభ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవాని పొరపాటు... చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Jun 19, 2020, 7:01 PM IST
Highlights

రాజ్యసభ ఎన్నికల్లో ఓ టిడిపి ఎమ్మెల్యే అవగాహన లోపంతో ఓటింగ్ లో పాల్గొనడంతో  ఆ ఓటు చెల్లకుండా పోయింది.

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఓ టిడిపి ఎమ్మెల్యే అవగాహన లోపంతో ఓటింగ్ లో పాల్గొనడంతో  ఆ ఓటు చెల్లకుండా పోయింది. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మొదటి ప్రాధాన్యత స్థానంలో 1 అని పెట్టాల్సిన చోట టిక్ మార్క్ పెట్టినట్లు సమాచార. ఈ పొరపాటు కారణంగా ఆమె ఓటు చెల్లకుండా పోవడంతో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యకు 17ఓట్లు మాత్రమే వచ్చి ఓటమిపాలయ్యారు. 

దీంతో పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడం లో విఫలమయ్యారని పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు పార్టీ నాయకులను వివరణ కోరినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గెలిచిన నలుగురికి తలో 38 ఓట్లు వచ్చాయి.

read more   చంద్రబాబుకు షాక్: ఓట్లు చెల్లకుండా రెబెల్స్ సూపర్ ప్లాన్

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్య 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ విషయంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. సంఖ్యాబలం లేకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపారు. ఈ సందర్భంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్ ను జారీ చేసింది. 

ఈ సందర్భంగా పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

click me!