అనుకున్నదే: రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్, వర్ల ఓటమి

By Siva KodatiFirst Published Jun 19, 2020, 6:23 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. 
 

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గెలిచిన నలుగురికి తలో 38 ఓట్లు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్య 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ విసయంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. సంఖ్యాబలం లేకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపారు. ఈ సందర్భంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్ ను జారీ చేసింది. 

ఈ సందర్భంగా పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

click me!