చక్రపాణిరెడ్డి కాళ్లబేరానికి దిగిన టిడిపి

Published : Jul 31, 2017, 07:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
చక్రపాణిరెడ్డి కాళ్లబేరానికి దిగిన టిడిపి

సారాంశం

తెలుగుదేశంపార్టీ నాయకత్వం నంద్యాలలో శిల్పాచక్రపాణిరెడ్డి కాళ్లబేరానికి దిగివచ్చింది మోహన్ రెడ్డి పార్టీని వదిలేయగానే టిడిపిలోని నేతలందరూ చక్రపాణిరెడ్డిని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. తన పర్యటనలో చక్రపాణి కనిపించకపోయినా చంద్రబాబు కనీసం వాకాబు కూడా చేయలేదు.

తెలుగుదేశంపార్టీ నాయకత్వం నంద్యాలలో శిల్పాచక్రపాణిరెడ్డి కాళ్లబేరానికి దిగివచ్చింది. నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై చక్రపాణిరెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడి నుండే చక్రపాణిరెడ్డికి టిడిపిలో సమస్యలు మొదలయ్యాయి. మోహన్ రెడ్డి దెబ్బ చక్రపాణిరెడ్డి మీద బాగా పడింది.

మోహన్ రెడ్డి పార్టీని వదిలేయగానే టిడిపిలోని నేతలందరూ చక్రపాణిరెడ్డిని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. చంద్రబాబునాయుడు పర్యటనలకు అసలు సమాచారమే ఇవ్వటం మానేసారు. అంటే, చంద్రబాబు ఆదేశాలు లేకుండానే నేతలు చక్రపాణిరెడ్డిని దూరంగా పెడతారా? తన పర్యటనలో చక్రపాణి కనిపించకపోయినా చంద్రబాబు కనీసం వాకాబు కూడా చేయలేదు. అటువంటి పరిస్ధితిల్లో చక్రపాణి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

అయితే, ఈరోజు సాయంత్రం చక్రపాణిరెడ్డి ఇంటికి సోదరుడు, వైసీపీ అభ్యర్ధి మోహన్ రెడ్డి వచ్చారు. వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా మోహన్ రెడ్డి కోరారు. వైసీపీలోకి వచ్చేయాల్సిందిగా కోరినట్లు మోహన్ రెడ్డి మీడియాతో స్వయంగా చెప్పారు.

దాంతో సోదరులిద్దరి కలయిక జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. విషయం చంద్రబాబుకు చేరింది. చక్రపాణి రెడ్డి వైసీపీలోకి వెళితే జరగబోయే డ్యామేజిని గ్రహించిన చంద్రబాబు వెంటనే దూతలను రంగంలోకి దింపారు. సిఎం రమేష్, మంత్రి కాలువ శ్రీనివాసులు తదితరులు చక్రపాణిరెడ్డి ఇంటికి క్యూ కట్టారు. పార్టీని వీడొద్దంటూ బ్రతిమాలుకుంటున్నారు. అదే సందనుకుని చక్రపాణి కూడా వచ్చిన నేతలతో తన అక్కసంతా తీర్చుకున్నారు. సరే, చివరకు చక్రపాణిరెడ్డి ఏం చేస్తారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

 

PREV
click me!

Recommended Stories

MLA Viral Video: ఎమ్మెల్యే రాస‌లీలలు.? ఈ వీడియోలో ఉంది నిజంగానే జ‌న‌సేన నాయ‌కుడా.?
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు