బాలయ్య దారిలోనే...: మహిళ చెంప చెల్లుమనిపించిన అశోక్ గజపతి రాజు

Published : Mar 08, 2021, 02:59 PM ISTUpdated : Mar 08, 2021, 03:35 PM IST
బాలయ్య దారిలోనే...: మహిళ చెంప చెల్లుమనిపించిన అశోక్ గజపతి రాజు

సారాంశం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అనూహ్యమైన సంఘటన జరిగింది టీడీపీ నేత, మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజు ఓ మహిళ కార్యకర్త చెంపను చెళ్లుమనిపించారు.

విజయనగరం: తమ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనినయర్ నేత, మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజుకు ప్రేరణ ఇచ్చినట్లున్నారు. అభిమానులపై చేయి చేసుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారింది. అదే దారిలో అశోక్ గజపతిరాజు నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. 

అశోక్ గజపతి రాజు సోమవారం ఎన్నికల ప్రచారం సహనం కోల్పోయారు. ఓ మహిళ చెంపపై ఆయన కోట్టారు. పూలు చల్లిందనే కోపంతో ఆయన ఆమెపై చేయి చేసుకున్నారు. నిజానికి అశోక్ గజపతి రాజు రాజకీయాల్లో చాలా గౌరవమర్యాదలు పాటిస్తారు. కానీ అకస్మాత్తుగా ఆయన ఈ చర్యకు దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహిళ మెడలు వంచి అశోక్ గజపతిరాజు ఆమెను కొట్టారు. దాంతో అవమానం జరిగిందనే భావనకు గురై మహిళ అక్కడి నుంచి పోళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహిళా దినోత్సవం రోజు అశోక్ గజపతి రాజు ఓ మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu