కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ ఆందోళన

Published : Jan 05, 2019, 10:53 AM IST
కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ ఆందోళన

సారాంశం

కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే

కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు శనివారం గుంటూరులో  ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ కి, కన్నా లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. రంగంలోకి వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా పోటీపోటాగా ఆందోళన చేపట్టారు.  మోదీ, కన్నాకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతల ఆందోళతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu