మోదీ నవ్వు దేనికి సంకేతం..? ట్విట్టర్ లో లోకేష్

Published : Jan 05, 2019, 10:11 AM IST
మోదీ నవ్వు దేనికి సంకేతం..? ట్విట్టర్ లో లోకేష్

సారాంశం

హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం పై పోరాటం చేయడమే తాము చేసిన నేరమా అని ప్నశ్నించారు.చంద్రబాబుని బీజేపీ నేతలు తిడుతుంటే.. మోదీ నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమంటూ లోకేష్ మండిపడ్డారు. 


ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ నేతలపై మరోసారి లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. హోదా కోసం మోదీని నిలదీయడం తప్పా అని లోకేష్ ప్రశ్నించారు.  హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం పై పోరాటం చేయడమే తాము చేసిన నేరమా అని ప్నశ్నించారు.చంద్రబాబుని బీజేపీ నేతలు తిడుతుంటే.. మోదీ నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమంటూ లోకేష్ మండిపడ్డారు. 

‘‘హోదాకోసం మోడీగారిని నిలదీయడం తప్పా? హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చెయ్యడం నేరమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని బీజేపీ నాయకులు అసభ్య పదజాలంతో తిడుతుంటే సుదీర్ఘ అనుభవం ఉండి, దేశానికి పెద్దన్న గా ఉండాల్సిన ప్రధాని మోడీ గారు నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతం?’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

‘‘దేశం కోసం ప్రధాని విదేశీ పర్యటనలు ముఖ్యమైనట్టు, రాష్ట్ర భవితకోసం సీఎం విదేశీ పర్యటనలూ ముఖ్యమే. మరి ముఖ్యమంత్రిగారి దావోస్ పర్యటన పై ఆంక్షలు విధించిన కేంద్రం, ప్రధాని విదేశీ పర్యటనలపై కూడా షరతులేమైనా పెట్టిందా?’’ అంటూ ప్రశ్నించారు. 

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu