టీడీపీ నేతల ఆందోళన... స్పీకర్ అసహనం

By telugu teamFirst Published Jul 19, 2019, 10:15 AM IST
Highlights

శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా... సభ ప్రారంభం కాగానే.. పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికార పక్షం పట్టించుకోలేదు. పోలవరంపై  చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పోలవరం పై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కాగా.... టీడీపీ నేతల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా... సభ ప్రారంభం కాగానే.. పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికార పక్షం పట్టించుకోలేదు. పోలవరంపై  చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా... వారు ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.

‘‘మీరంతా సీనియర్ మెంబర్స్, ఒక ప్రశ్నను ఎంతసేపు లాగుతారు? ఎంతకీ తృప్తి చెందకపోతే ఏ ప్రభుత్వం కూడా రిప్లై ఇవ్వలేదు. మిగిలిన సభ్యుల సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు. కాబట్టి నేను అన్నివేళలా ఇటువంటి వాటికి అనుమతి ఇవ్వను’’ అంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవద్దని హితవు పలికారు. అయినా... టీడీపీ నేతలు వినిపించుకోకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. 

click me!