టిడిపి నేతల ఓవర్ యాక్షన్

Published : May 13, 2017, 04:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టిడిపి నేతల ఓవర్ యాక్షన్

సారాంశం

లేని అధికారాలను మీదేసుకుని ఛైర్మన్ ఆకస్మిక తనిఖీకి వచ్చానని చెప్పటంతో పోలీసులకు విచిత్రంగా అనిపించింది. అందులోనూ ఎంఎల్ఏ బోండా ఉమను వెంట పెట్టుకుని రావటమన్నది సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టింది.

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు బాగా అతి చేస్తున్నారు. తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఓ పోలీసు స్టేషన్నే తనిఖీ చేయటం ఇపుడు చర్చనీయాంశమైంది. నాగుల్ మీరా అని ఓ టిడిపి నేతున్నారు. ఆయన్ను ప్రభుత్వం ఇటీవలే పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించింది. ఆయన బాధ్యతలేమిటంటే, కార్పొరేషన్ తరపున పోలీసు సిబ్బందికి నిర్మిస్తున్న క్వార్టర్స్ మరమ్మత్తులు, ఇతర నిర్మాణాలను పర్యవేక్షించటం మత్రమే. కానీ ఆయన పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసారు. నిజానికి పోలీసు స్టేషన్ల తనిఖీ అన్నది పోలీసు బాసుల పని.

కానీ నాగూల్ ఏం చేసారంటే విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమాతో కలిసి విజయవాడ రూరల్లో ఉన్న నున్న పోలీసు స్టేషన్ను శుక్రవారం వచ్చారు.  కార్పొరేషన్ ఛైర్మన్ ను చూడగానే పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆకస్మిక తనిఖీకి తాను వచ్చినట్లు చెప్పగానే అవక్కయ్యారు. ఛైర్మన్ వస్తున్నట్లు కనీసం విజవయాడ పోలీసు కమీషనర్ గౌతమ్ సవాంగ్ కు కూడా సమాచారం లేదట. వచ్చిన వారు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న సిఐ, ఎస్ఐలు తదితర సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా అనేక ఇతర అంశాలపై వివరాలడగటంతో సిబ్బంది బాగా ఇబ్బంది పడ్డారట.

లేని అధికారాలను మీదేసుకుని ఛైర్మన్ ఆకస్మిక తనిఖీకి వచ్చానని చెప్పటంతో పోలీసులకు విచిత్రంగా అనిపించింది. అందులోనూ ఎంఎల్ఏ బోండా ఉమను వెంట పెట్టుకుని రావటమన్నది సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టింది. మొత్తానికి టిడిపి ఎంఎల్ఏలు, నేతల ఓవర్ యాక్షన్ కు హద్దులు చెరిగిపోతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే