ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో టీడీపీ నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఎన్నికల వాయిదాతో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడిందని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. ఎన్నికల వాయిదా కరోనా ఎఫెక్టా.. కేంద్రం ఎఫెక్టా చెప్పాలని ఆమె అన్నారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రజాస్వామ్యం నిలబడిందని ఆమె అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని కోర్టుకు వెళ్తామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలో వైసీపీ అరాచకాలపై వేల ఫిర్యాదులు అందాయని, అందుకు ఆధారాలున్నాయని ఆయన అన్నారు. వైసీపీ తరఫున అధికారులే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
undefined
Also Read: కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
అధికారులపై ప్రైవేట్ కేసులు పెడుతామని, జగన్ ప్రభుత్వం వాళ్లను కాపాడలేదని ఆయన హెచ్చరించారు. అమరావతిలో పిన్నెల్లి కారుపై దాడిపై కేసు పెట్టిన పోలీసులు మాచర్ల దాడిపై ఎందుకు నమోదు చేయలేదని ఆయన అడిగారు.
జగన్ వైరస్ నుంచి రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ ప్రభుత్వం ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించలేదని అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులను పట్టించుకోకుంటే రమేష్ కుమార్ శ్రీలక్ష్మి లాగా జైలుకు వెళ్తారని ఆయన అన్నారు.
Also Read: ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీ కొరడా: జగన్ కు షాక్, చంద్రబాబుకు ఊరట