వాయిదా కాదు పూర్తిగా రద్దు చేయాలి... పవన్ కళ్యాణ్ డిమాండ్

By Sree sFirst Published Mar 15, 2020, 11:44 AM IST
Highlights

అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ పూర్తి ప్రక్రియను మల్లి చేపట్టాలని డిమాండ్ చేసారు. నామినేషన్ల ప్రక్రియ నుండి మళ్ళీ మొదలుపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆరు వారాలపాటు కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది కాబట్టి అది రద్దు కాదని ఆయన అన్నారు. 

అయితే ఎవరయితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో వారు అలాగే కొనసాగుతారని, తదుపరి ఎన్నిక పూర్తయిన తరువాత ఎన్నికయ్యే అభ్యర్థులతో కలిసి వీరు బాధ్యతలను స్వీకరిస్తారని అన్నారు. 

Also read: ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీ కొరడా: జగన్ కు షాక్, చంద్రబాబుకు ఊరట

అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ పూర్తి ప్రక్రియను మల్లి చేపట్టాలని డిమాండ్ చేసారు. నామినేషన్ల ప్రక్రియ నుండి మళ్ళీ మొదలుపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. 

చాలామందిని నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని అందుకోసం అందరికి కూడా అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన హింసాత్మక సంఘటనలు అందరూ చూసారని, అలా మిగిలిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా, వేస్తే ఉపసంహరించుకోమని బెదిరించారని అన్నారు. 

ఇలా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఏకగ్రీవాలన్నిటిని రద్దు చేయాలనీ, భయపెట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన అధికార పక్షంపై దుమ్మెత్తి పోశారు. 

Also read; కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఇక నిన్న నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలోను పవన్ కళ్యాణ్ హింసాత్మక రాజకీయాలపైన విసుర్లు విసిరారు.  జనసేన పార్టీ 6వ ఆవిర్భావసభకు జనసేన ముఖ్యనాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావసభలో ... జనసేన పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. సమాజంలో పిరికితనం ఎక్కువైపోయిందని, ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి అనుక్షణం కృషి చేస్తానని అన్నారు. 

ఇక తాను రాజకీయాల్లో వచ్చిన వెంటనే గెలిచి పదవులు పొందడానికి రాలేదని. లాంగ్ టర్మ్ గోల్స్ తో, దూర దృష్టితో సమాజానికి మంచి చేయడానికి వచ్చానని అన్నారు పవన్.ప్రస్తుత రాజకీయాలపై కొన్ని కీలక కామెంట్స్ చేసాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో హింసాపూరిత రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. 

తాను ఇదే రాజమండ్రిలో భారీ కవాతు నిర్వహిస్తే 7 లక్షల మంది దాకా తన వెంట నడిచి వస్తే... మరో మూడు లక్షల మంది చుట్టుపక్కల చిక్కుకుపోయారని ఆయన అన్నారు. ఇంత మంది తన వెంట నడిస్తే అందులో ఎవరు కూడా ఎన్నికల్లో ఓట్లు మాత్రం తమ పార్టీకి వేయలేదని.... హింసాత్మక రాజకీయాలనే ఎన్నుకున్నారని అన్నారు. 

అలా క్రిమినల్స్ ని ఎన్నుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారని, ఓట్లు వేసిన ప్రజలదే తప్పని, రాష్ట్రంలో ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అధికార పార్టీ వారందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

click me!