వాడో పిచ్చిపట్టిన కుక్క... దుష్ట పాలనలో దైవ దర్శనానికీ అనుమతులు..!: జగన్ పై బుద్దా, నక్కా సీరియస్ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 19, 2023, 12:21 PM IST
Highlights

చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చేలా చూడాలంటూ దైవదర్శనాలకు వెళుతున్న బుద్దా వెంకన్న, నక్కా ఆనంద్ బాబు ను పోలీసులు అడ్డుకున్నారు. 

గుంటూరు : స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు. అతడి జైలు నుండి బయటకు రానివ్వకుండా జగన్ సర్కార్ ప్రయత్నిస్తుంటే... బెయిల్ కోసం టిడిపి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, క్వాష్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. అనంతరం విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పై విచారణ జరగనుంది. 

ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసిబి కోర్టుల విచారణలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు వచ్చి విడుదల అయ్యేలా చూడలంటూ టిడిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా వున్న దేవాలయాల్లో పూజలు చేపట్టారు. అయితే ఇలా పూజలు చేసేందుకు దేవాలయాలకు వెళుతున్న టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. 

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళుతున్న టిడిపి నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసారు. తన ఇంటి నుండి దుర్గమ్మ ఆలయానికి కొబ్బరికాయతో బయలుదేరిన వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో వెంకన్న ను అరెస్ట్ చేసారు. దీంతో ఆయనను అక్కడినుండి తీసుకెళ్లనివ్వకుండా టిడిపి నాయకులు తమ వాహనాలను పోలీస్ వాహనాలకు అడ్డుగా పెట్టారు. ఇలా బుద్దా వెంకన్న ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

వీడియో

పోలీసుల తీరుపై వెంకన్న తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. దైవదర్శనానికి వెళుతున్నా పోలీసుల అనుమతి తీసుకోవాలా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్  తర్వాత చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులే నీరుగారుస్తున్నారని... వైసిపి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారని అన్నారు. ప్రజలే వీరికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇలా తనను దుర్గమ్మ ఆలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసుల ముందే కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు వెంకన్న. 

Read More  గుంటూరులో ఉద్రిక్తత... మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ హౌస్ అరెస్ట్ (వీడియో)

ఇక మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును కూడా గుంటూరులో పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి ఆధ్వర్యంలో గుంటూరులోని శారద కాలనీ నుండి కొత్తపేట ఆంజనేయస్వామి వరకు జరిగే పాదయాత్రకు వెళ్ళడానికి సిద్దమైన ఆనంద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయినప్పటికి పోలీస్ వలయాన్ని  దాటుకుని ముందుకు వెళ్లడానికి మాజీ మంత్రి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆనంద్ బాబు ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

టిడిపి పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంపై ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న పోలీసులపై కేసు వేస్తానని మాజీ మంత్రి హెచ్చరించారు. జగన్ పిచ్చిపట్టిన కుక్కలా వ్యవహరిస్తున్నాడు... వాడు చెప్పినట్లు మీరు చేస్తున్నారంటూ పోలీసులపై ఆనంద్ బాబు సీరియస్ అయ్యారు. 
 

click me!