విజయవాడ బాలిక ఆత్మహత్య : ‘ఔను.. వేధించాను..ఇంతవరకు వస్తుందనుకోలేదు’ నేరం ఒప్పుకున్న టీడీపీ నేత...

By SumaBala Bukka  |  First Published Feb 1, 2022, 7:17 AM IST

ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని.. స్కూలుకు వెళ్లి, వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించే వాడినని చెప్పుకొచ్చాడు. తాను చేసింది తప్పే అని.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని... వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది.  మరోవైపు..  ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.  అందులో ఎక్కువగా  ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యత  ఇచ్చింది. 


విజయవాడ :  Sexual harassmentలతో బాలికను చిదివేసిన tdp leader వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లోని లోటస్ లెజెండ్ అపార్ట్ మెంట్ లో టిడిపి నేత vinod jain లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక suicideకు పాల్పడిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.  దీనిపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు  suicide noteలో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. 

ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని.. స్కూలుకు వెళ్లి, వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించే వాడినని చెప్పుకొచ్చాడు. తాను చేసింది తప్పే అని.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని... వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది.  మరోవైపు..  ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.  అందులో ఎక్కువగా  ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యత  ఇచ్చింది. 

Latest Videos

undefined

రక్త సంబంధాలపై  ఎంతో మమకారం పెంచుకున్నట్లు అందులోని ప్రతి పదం ద్వారా అర్థమవుతుంది. చిన్నవయసులోనే  కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ చిన్నారి.. అమ్మా,నాన్న,తమ్ముడు గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్నోట్లో బంధాలు, బాంధవ్యాలు గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’  అని ఆకాంక్షించింది.  

తల్లిదండ్రుల పట్ల ఆమెకు ఎనలేని ప్రేమాభిమానాలను ఆ లేఖలో చాటుకుంది. తన తమ్ముడిని సైతం పదేపదే ప్రస్తావించింది. తమ్ముడి పట్ల తనకున్న అభిమానాన్ని వివరించిన తీరు అందరినీ కదిలించింది. తనను బాగా చూసుకున్నారని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక  ఈ లేఖలోని  అంశాలు చూసిన కుటుంబీకులు  ఇంత ఘోరం చేశాడా, అని కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ‘న్యాయం చేయండి, మా బంగారు బొమ్మను మాకు తీసుకురండి’  అంటూ వారు తల్లడిల్లుతున్న తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

అలాంటి వాడు అనుకోలేదు..
ఇక పోలీసులు అపార్ట్మెంట్ వాసులను విచారింనప్పుడు, బాలిక వచ్చి వెళ్ళే సమయాల్లో మెట్లు, లిఫ్ట్ వద్ద వినోద్ జైన్ కనిపించేవాడు అని చెప్పారు. అయితే అతని వయసు రీత్యా అనుమానం రాలేదన్నారు. వికృత చేష్టలకు పాల్పడతాడని తాము ఊహించలేదని తెలిపారు.  ఇంతటి నీచానికి పాల్పడిన దుర్మార్గుడికి ఉరి శిక్ష వేసినా తక్కువేనని చెప్పినట్లు తెలిసింది.

ఫుటేజీలో వికృత చేష్టలు 
అపార్ట్మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్లో కామాంధుని వికృత చేష్టల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. బాలిక అపార్ట్మెంట్ నుంచి దూకే దృశ్యాలు కూడా రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్ పిట్టగోడ చివర బాలికను గమనించిన ప్రత్యక్షసాక్షులు.. కింద పడతావు అని అరుస్తున్నా దూకేసిందని.. అంతా నిమిషంలోపే సంఘటన జరిగిందని వారు చెబుతున్నారు.

 దీంతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని కృష్ణా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు మిన్నంటాయి.  ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. అధికార, ప్రతిపక్షాలూ ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించాయి. 
 

click me!