ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఏపీ ప్రభుత్వం పిలుపు: రేపు చర్చలకు రావాలని లేఖ పంపిన సర్కార్

Published : Jan 31, 2022, 08:48 PM IST
ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఏపీ ప్రభుత్వం పిలుపు: రేపు చర్చలకు రావాలని లేఖ పంపిన సర్కార్

సారాంశం

చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు రాత్రి లేఖ పంపింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ఆ లేఖలో కోరింది.  


అమరావతి: చర్చలకు రావాలని Employees Union సంఘాల నేతలకు Andhra Pradesh ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఫిబ్రవరి 1 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వం పంపింది.ప్రభుత్వం నుండి  ఉద్యోగ సంఘాల నేతలు (PRC స్టీరింగ్ కమిటీ నేతలకు) సోమవారం నాడు రాత్రి letterను పంపింది. అయితే ఇవాళ  ఉదయం నుండి సాయంత్రం వరకు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్  కమిటీ  చర్చించారు.  ప్రభుత్వం నుండి లిఖిత పూర్వకంగా చర్చలకు రావాలని పిలుపు వస్తేనే తాము చర్చలకు వెళ్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది.అయితే పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవడంతో పాటు జనవరి నెలకు పాత జీతాన్నే ఇవ్వడం, ఆశుతోష్ మిశ్రా రిపోర్టును బయట పెట్టాలని కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అయితే  ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుండి  లేఖలు పంపింది. అయితే ప్రభుత్వం నుండి చర్చల విషయమై పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దఫాలు ఉద్యోగులను చర్చలకు పిలిచింది. అయితే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు హాజరౌతామని చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీ వరకు పలు రకాల ఆందోళనలను ఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి. తమ ఆందోళనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతుంది. చర్చలకు రావడానికి ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వానికి షరతులు విధించాయి.
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu