మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి: రేపు అంత్యక్రియలు

By narsimha lode  |  First Published Jan 31, 2022, 9:49 PM IST

మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి సోమవారం నాడు మరణించాడు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. మంగళవారం నాడు శ్రీధర్ కృష్ణారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు.


నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.Sridhar krishna Reddy   సోమవారం నాడు అనారోగ్యంతో మరణించారు.  2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా నెల్లూరు సిటీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో శ్రీధర్ కృష్ణారెడ్డి టీడీపీలో చేరారు.  2014 ఎన్నికల్లో ఆయన నెల్లూరు సిటీ నుండి TDP అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి పట్ల టీడీపీ చీఫ్ Chandrababu సంతాపం తెలిపారు. శ్రీధర్ కృష్ణారెడ్డి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని టీడీపీ నేత బీద రవిచంద్రయాదవ్ చెప్పారు. ప్రజలు, కార్యకర్తల కోసం శ్రీధర్ కృష్ణారెడ్డి పనిచేశారని రవిచంద్రయాదవ్ గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి అంత్యక్రియలను మంగళవారం నాడు నిర్వహించనున్నారు.

Latest Videos

శ్రీధర్ కృష్ణారెడ్డి మృతిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తాము ఆయనను శ్రీధరన్నగా పిలుచుకుంటామని, ఆయన హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. శ్రీధర కృష్ణారెడ్డి తనకు అత్యంత ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు అని వెల్లడించారు. 

click me!