చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన.. బాపట్ల సముద్ర తీరంలో బీచ్ ఆర్ట్, ఫోటోలు వైరల్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే .  బాపట్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ వినూత్న నిరసన తెలిపారు. ఇందుకోసం ఆయన బాపట్ల సముద్ర తీరంలో బీచ్ ఆర్ట్ వేయించారు.


స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చంద్రబాబుకు మద్ధతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ వినూత్న నిరసన తెలిపారు. ఇందుకోసం ఆయన బాపట్ల సముద్ర తీరంలో బీచ్ ఆర్ట్ వేయించారు. ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ దీనిని రూపొందించారు. #Justice for CBN అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఏపీ మ్యాప్, పక్కన కోర్టుల్లో న్యాయమూర్తులు వినియోగించే సుత్తిని రూపొందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు .

 

Latest Videos

 

అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయాన్ని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో మరోసారి ప్రస్తావించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో, తమ అధినేతను కూడా అలాగే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎందరో యువనేతలకు స్పూర్తినిచ్చిన నాయకుడిపై రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రూ.43 వేల కోట్ల దేశ సంపదను దోచుకున్న నేత బెయిల్‌పై వచ్చి పదేళ్లు పూర్తయినందుకు కొందరు సంబరాలు చేసుకున్నారంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. దీనికి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ధీటుగా బదులిచ్చారు. 

 

 

మరోవైపు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును కస్టడీ కోరుతూ  ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ నెల 22న ఉదయం పదిన్నర గంటలకు తీర్పును వెల్లడించనున్నట్టుగా  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి  గురువారం నాడు సాయంత్రం ప్రకటించారు. 
 

click me!