కర్నూల్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Published : Jun 23, 2021, 10:27 AM ISTUpdated : Jun 23, 2021, 12:50 PM IST
కర్నూల్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

సారాంశం

కర్నూల్ లో  బుధవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  విషం తాగి  నలుగురు ఆత్మహత్య చేసుకొన్నారు.   

కర్నూల్ లో  బుధవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  విషం తాగి  నలుగురు ఆత్మహత్య చేసుకొన్నారు.  ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.

 

 భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకొన్నారని స్థానికులు గుర్తించారు. కర్నూల్ పట్టణంలోని వడ్డెగేరిలో టీవీ మెకానిక్ గా పనిచేస్తున్న ప్రతాప్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.  ప్రతాప్ ఆయన భార్య హేమలత, పిల్లలు జయంత్, రిషితలు ఆత్మహత్య చేసుకొన్నారు. కరోనా కారణంగా బంధువులు, స్నేహితులు చనిపోయారనే వేదనతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది.ఈ మేరకు చనిపోయేముందు ప్రతాప్ కుటుంబసభ్యులు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu