భావప్రకటన స్వేచ్చ కేవలం వైసిపి వారికేనా ... మాకు వర్తించదా?: డిజిపికి వర్ల రామయ్య లేఖ

By Arun Kumar PFirst Published Jul 27, 2021, 4:03 PM IST
Highlights

ప్రతిపక్ష పార్టీల భావప్రకటన స్వేచ్చను హరించేలా ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ భావ ప్రకటన స్వేచ్చను హరించేలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. డిజిపి చేస్తున్న తప్పులను వివరిస్తూ ఆయనకే లేఖ రాశారు రామయ్య. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు వర్ల.

''మీ(డిజిపి సవాంగ్) అధ్యక్షతన రాష్ట్ర పోలీసులు తెలుగుదేశం పార్టీ వారికి, ఇతర ప్రతిపక్షాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ 19ను నిషేధించినట్లుగా కనిపిస్తున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం సంక్రమించిన భావ స్వేచ్ఛను రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాలకు దక్కకుండా ఉక్కు పాదాలతో అణచి వేస్తున్నారు'' అని వర్ల ఆరోపించారు. 

''మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై గతంలో అధికార పార్టీ దాడిచేసి రాళ్లు, చెప్పులు విసిరితే... అది వారి భావ స్వేచ్ఛ అని మీరు ఆర్టికల్ 19 గురించి రాష్ట్ర ప్రజలకు వివరించారు. మీరు వివరించిన భావ ప్రకటన స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీ వారికి, ఇతర ప్రతిపక్షాలకు వర్తించదా? రాష్ట్ర డిజిపిగా నిస్పక్షపాతంగా అందరిని ఒకేలా చూడవలసిన మీకు ఇంత పక్షపాతం ఎందుకు?'' అని నిలదీశారు. 

read more  ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా...: సీఎం జగన్ పై అచ్చెన్న సెటైర్లు

''తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిరసన కార్యక్రమం చేపట్టిన సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ , సెక్షన్ 144 సిఆర్పిసి విధించి నిరసన తెలపకుండా నిరోధిస్తున్నారు. ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేసి వారి భావ స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారు?'' అని ప్రశ్నించారు. 

''వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులును ఎందుకు నిర్బంధించారు... ఆయన చేసిన నేరం ఏమిటి? చెత్త పన్ను విధించిన ప్రభుత్వంపై నిరసన తెలియజేయలని అనుకోవడమే ఆయన చేసిన నేరమా? మీ మాటను మీరే తప్పటం ఎంతవరకు సబబు?'' అని తన లేఖ ద్వారా డిజిపిని నిలదీశారు వర్ల రామయ్య. 
 

click me!