నాకు నేనే మెమోలు ఇచ్చుకొన్నట్టు: అధికారులపై వైఎస్ జగన్ ఆగ్రహం

By narsimha lodeFirst Published Jul 27, 2021, 3:46 PM IST
Highlights


జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నాడు నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో  సీఎం జగన్  కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు సరిగా లేని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.  మెమోలు జారీ చేయడమంటే తనకు తాను మెమోలు ఇచ్చుకోవడమేనని ఆయన చెప్పారు.


అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది హజరు సరిగా లేకపోవడంతో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పందన కార్యక్రమంలో  ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం జగన్ మంగళవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులకు మెమోలు జారీ చేస్తే తనకు తానే మెమోలు ఇచ్చుకొన్నట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.పనితీరు సరిగా లేని వారికి మెమోలు జారీ చేయడం తనకు బాధ కల్గిస్తోందన్నారు.

గ్రామ వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.42 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వీరిలో 1.62 శాతం మంది అటెండెన్స్ వేయడం లేదని సీఎం చెప్పారు. అటెండెన్స్ వేయని వారిని అటెండెన్స్ వేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది పనితీరుతో ఆయా శాఖల్లో క్షేత్రస్థాయిల్లో ఉన్నతాధికారులు  పర్యవేక్షించాలని గత స్పందన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఆదేశించారు. ఆయా శాఖల పనితీరుపై కూడ సీఎం సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు  క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. అయితే ఐటీడీఏ పీఓలు, జేసీలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ఏ మేరకు పర్యటిస్తున్నారనే విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆరా తీశారు.

66.75 శాతం మాత్రమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారని జగన్ ఈ సందర్భంగా సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అధికారుల పనితీరు సరిగా లేదని సీఎం జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెవిన్యూ శాఖలో జేసీలు 78 శాతానికి పైగా తమ శాఖలో తనిఖీలు నిర్వహించారుఐటీడీఏ పీఓలు కేవలం 18 శాతం మాత్రమే క్షేత్రస్థాయిలో పర్యటించారని సీఎం జగన్ తెలిపారు. సరిగా పనిచేయని అధికారులకు మెమోలు జారీ చేయాలని సీఎం జగన్  ఆదేశించారు. 

 

click me!