విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా... ఆ మాఫియా పనే..: విజిలెన్స్, ఏసిబికి వర్ల రామయ్య ఫిర్యాదు

Arun Kumar P   | Asianet News
Published : Feb 20, 2022, 12:54 PM IST
విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా... ఆ మాఫియా పనే..: విజిలెన్స్, ఏసిబికి వర్ల రామయ్య ఫిర్యాదు

సారాంశం

నిరుపేదల ఆకలిబాధను తీర్చడానికి ఉపయోగించే రేషన్ బియ్యంను కూడా ఏపీలో ఓ మాఫియా మూఠాా విదేశాలనే తరలించి ఆదాయం పొందుతోందని టిడిపి నేత వర్ల రామయ్య ఆరోపించారు. 

అమరావతి: నిరుపేద ప్రజల ఆకలిబాధను తీర్చేందకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా అందించే బియ్యం విషయంలోనూ వైసిపి (YSRCP) నాయకులు అక్రమాలకు పాల్పడతున్నారని టిడిపి (tdp0 సీనియర్ నాయకులు వర్ల రామయ్య (varla ramaiah) ఆరోపించారు. ఏపీలో రేషన్ బియ్యం (ration rice) మాఫియా పురుడుపోసుకుందని... వైసిపి నాయకులు అధికార అండతో పిడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలా పీడీఎస్బియ్యాన్ని తరలిస్తున్న మాఫియాపై(pdf rice mafia) సమగ్ర విచారణ జరిపించాలంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తో పాటు ఏసీబీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేసారు.   

''ఆర్ధికంగా వెనకబడిన వర్గాల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోవడం దుర్మార్గం. ఏపీలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా కోసమే కొన్ని మాఫియాలు ఏర్పడ్డారు. కాకినాడ పోర్టు (kakinada port) ద్వారా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది'' అని వర్ల ఆరోపించారు.

''రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదవారికి అందాల్సిన బియ్యం అందక పస్తులు గడుపుతున్నారు. 2020-21 లో రూ.7,972 కోట్ల విలువ గల 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించారు. 2021-22లో ఇప్పటికే రూ7,710 కోట్ల విలువ గల 30.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి చేశారు. కోవిడ్ ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో బియ్యం ఎగుమతులు చేశారంటే దీని వెనుక మాఫియా ఉందని అర్థమవుతుంది''  అని పేర్కొన్నారు. 

''ఆఫ్రికన్ దేశాలయిన ఐవరీకోస్ట్, టాంగో, సెనెగల్, బెనిన్, గునియాలకు ఏపీ నుండి పిడిఎఫ్ బియ్యం అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నాయి. కేవలం ఈ ఐదు ఆఫ్రికా దేశాలకే 2020-21 లో 23.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలిపోయింది'' అని వర్ల రామయ్య తెలిపారు. 

''దేశంలోని ఇతర రాష్ట్రాలు పేదప్రజల అవసరాల కోసం పిడిఎస్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. కానీ ఏపీలో మాత్రం కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతి చేయబడుతున్న బియ్యం మొత్తం పిడిఎస్ బియ్యమే. ఇదంతా మన రాష్ట్రానికి చెందిన బియ్యమే. ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయంటే అది ఖచ్చింతంగా పిడిఎస్ బియ్యం సేకరించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాకినాడ ఓడరేవు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్‌ బియ్యం వెనుక అధికార వైసీపీ నేతల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి'' అని వర్ల పేర్కొన్నారు. 

''పిడిఎస్ బియ్యం బలహీన వర్గాల అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం (indian government) కూడా పెద్ద ఎత్తున ప్రజా పంపిణీకి తన సహాయ హస్తాన్ని అందిస్తోంది. అలాంటిది ఏపీలో ఈ బియ్యం పేద, బలహీన వర్గాల ప్రజల వరకు చేరడం లేదు.కాబట్టి బియ్యం అక్రమరవాణా స్మగ్లర్లు, నిందితులపై మీరు తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో పేదలు ఆకలి మంటను చల్లార్చుతుంది'' అని ఏసిబి(acb), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు చేసిన ఫిర్యాదులో వర్ల రామయ్య పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?