వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజీనామా వ్యాఖ్యలు: నేడు నరసాపురానికి పవన్ కళ్యాణ్

Published : Feb 20, 2022, 11:41 AM IST
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజీనామా వ్యాఖ్యలు: నేడు నరసాపురానికి పవన్ కళ్యాణ్

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు నరసాపురంలో పర్యటించనున్నారు. మత్సకార మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ఎంపీ దదవికి రాజీనామాచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్ కి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

ఏలూరు:జనసేన చీఫ్ Pawan Kalyan ఆదివారం నాడు సశ్చిమ గోదావరి జిల్లాలోని Narsapur లో పర్యటించనున్నారు.  పవన్ కళ్యాణ్  టూర్ ను పురస్కరించకొని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార మహాసభకు ఆయన హాజరుకానున్నారు.నర్సాపురం ఎంపీ Raghu Rama krishnam Raju ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు.  ఈ తరుణంలో నరసాపురంలో పవన్ కళ్యాణ్ టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

తనపై అనర్హత వేటు కోసం YCP నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.  తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. వారం రోజులు వైసీపీకి సమయం ఇస్తున్నానని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పార్టీ వాళ్లు రెండేళ్లగా ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మంతో బిజీగా ఉన్నారు. కుదిరితే స్పెషల్ ఫ్లైట్, కుదరకపోతే అందిన ఫ్లైట్‌లో తిరుగుతూ వరుసగా తనపై  ఫిర్యాదులు ఇస్తున్నారని రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. వైసీపీ ప్రయత్నాలు ఫలించకపోయినా తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణం రాజు ప్రకటించారు. అంతేకాదు భారీ విజయం సాధిస్తున్నానని ప్రకటించారు.

దీంతో  ఇవాళ  నర్సాపురం పవన్ పర్యటన ఆసక్తి పెంచుతోంది. ఒకవేళ నిజంగా రఘురామ ఎన్నికలకు వెళ్తే ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది కూడా ప్రస్తుతం చర్చ సాగుతుంది.ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడదీసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తే ఏ పార్టీ ఆయనకు అండగా నిలుస్తోందో కూడా చూడాల్సిందే.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Launches HPV Vaccine Program at Cheepurupalli, Ravivalasa | Asianet News Telugu
AP Food Commissioner Laughs: వాళ్ళు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడంలేదు సార్ | Asianet News Telugu