అనుమానం.. తాగిన మత్తు.. భార్యను చంపిన భర్త

Published : Jan 02, 2020, 07:55 AM IST
అనుమానం.. తాగిన మత్తు.. భార్యను చంపిన భర్త

సారాంశం

మేరీని అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఆస్తి విషయంలోనూ భార్యభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. మంగళవారం రాత్రి పిల్లలతో  కలిసి మేరీ చర్చికి వెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి వచ్చారు.

అనుమానం అతనిలోని మనిషిని చంపేసింది. రాక్షసుడిగా మార్చేసింది. దీనికి ఆస్తి తగాదాలు కూడా తోడయ్యాయి. మద్యం మత్తులో మృగంలా మారి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని చక్కానగర్ కి చెందిన మేరీ కమలక్ష్మి(48) పట్టణంలోని నాగరసింహ ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త శోభన్ రాజ్. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు బీటెక్ పూర్తి చేయగా, కుమార్తె బీటెక్ చదువుతోంది.

వీరు చక్కానగర్ లోని సొంతింట్లో నివాసం ఉంటున్నారు. మేరీని అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఆస్తి విషయంలోనూ భార్యభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. మంగళవారం రాత్రి పిల్లలతో  కలిసి మేరీ చర్చికి వెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి వచ్చారు.

నిందితుడు శోభన్ రాజు చర్చికి వెళ్లి ముందుగానే వెనక్కి వచ్చేశాడు. నాలుగు గంటల సమయంలో భార్యతో తగాదాకు దిగి ముందుగానే సిద్ధం చేసుకున్న రోకలి బండతో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో... ఆమె తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం