''లారీ క్లీనర్ నుండి రాష్ట్ర మంత్రిగా...ఆయన గత చరిత్ర ఇదీ''

Arun Kumar P   | Asianet News
Published : Dec 13, 2020, 10:41 AM IST
''లారీ క్లీనర్ నుండి రాష్ట్ర మంత్రిగా...ఆయన గత చరిత్ర ఇదీ''

సారాంశం

ఎమ్మెల్యే అయినప్పటికీ కొడాలి నాని తన దొంగ బుద్ధులు మార్చుకోకపోవడంతో చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాడని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్ విమర్శించారు. 

గుంటూరు: మంత్రి కొడాలి నాని గూడుపుటాని గుడివాడ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని... లారీ క్లీనర్ గా ఉన్నపుడు రాత్రి పూట రోడ్లపై ఆగివున్న లారీ టైర్లు దొంగిలించి అమ్ముకున్న చరిత్ర ఆయనదని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్ మండిపడ్డారు. నాని కొవ్వు కరిగించేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని... టీడీపీ  అధికారంలోకి వస్తే మొదట జైలుకు వెళ్లే వ్యక్తి కూడా ఆయనేనని సూర్యప్రకాశ్ అన్నారు. 

''కేవలం కాలం కలిసొచ్చి, చంద్రబాబు బాబు దయతో మాత్రమే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయినప్పటికీ కొడాలి నాని తన దొంగ బుద్ధులు మార్చుకోకపోవడతో చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆయన దొంగలకు షెల్డర్ గా ఉన్న  వైసీపీలో చేరారు'' అని ఎద్దేవా చేశారు. 

read more  పవన్‌కు షాక్, తిరుపతి బరిలో బీజేపీయే : సోము వీర్రాజు వ్యాఖ్యలు

''ఇప్పుడు మంత్రి పదవొచ్చాక కొడాలి నాని ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు.  గుడివాడ ప్రజలు ఆయన కొవ్వు కరిగించేందుకు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీని గెలిపించి నానికి తగిన బుధ్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు'' అని పేర్కొన్నారు. 

''మంత్రి పదవి అడ్డుపెట్టుకుని నాని ఈ 19 నెలల్లో గుడివాడ నియోజకవర్గంలో చేసిన దందాలు, అరాచకాలు ప్రతి ఒక్కరికి తెలుసు. పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. క్లీనర్ గా ఉన్నపుడు దొంగతనం గా లారీ టైర్లు అమ్ముకున్న కొడాలి నాని మంత్రి అయ్యాక బ్లాక్ లో రేషన్ బియ్యం  అమ్ముకుంటున్నారు.
 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాని చేసిన అవినీతిని బట్టబయలు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వస్తే మొదట జైలు కెళ్లే వ్యక్తి కొడాలి నానే. ఇప్పుడు కొడాలి నాని నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకు రాబోయే రోజుల్లో ప్రతిఫలం అనుభవించక తప్పదు'' అని సూర్యప్రకాశ్ హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu