యూపీ వద్దనుకున్న అదానీ సంస్థ ఏపీకి ముద్దయిందా..?: వైసీపీ సర్కార్‌పై సోమిరెడ్డి ఫైర్..

By Sumanth KanukulaFirst Published Jun 7, 2023, 12:17 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్లపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల నుంచి దోచుకుంటున్న రూ. 17వేల కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్లపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల నుంచి దోచుకుంటున్న రూ. 17వేల కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో సీఎం జగన్ డైరెక్ట్‌గా దోపిడీని స్టార్ట్ చేశారని  ఆరోపించారు. గృహావసరాల విద్యుత్ మీటర్ల టెండర్‌లో ఎల్1 ఆదానీ సంస్థ, ఎల్2గా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నిలిచిందని.. అగ్రికల్చర్ మీటర్లలో ఎల్‌1‌గా అదానీ సంస్థ, ఎల్2గా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నిలించిందని అన్నారు. రెండు వేర్వేరు టెండర్లలో రెండు సంస్థలు కేవలం వందల రూపాయల తేడాతో ఎల్1, ఎల్2లుగా నిలవడం క్విడ్ ప్రోకో కాదా? అని ప్రశ్నించారు. 

షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపణలు  చేశారు. ఉత్తరప్రదేశ్ వద్దనుకున్న అదానీ సంస్థ.. ఏపీకి ముద్దయిందా? అని ప్రశ్నించారు. యూపీకి అదానీ.. ఏపీకి ముద్దు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఏపీ ప్రజలు మేల్కోవాలని కోరారు. రూ. 17వేల కోట్ల భారం రాష్ట్ర ప్రజల మీదనే పడుతుందని అన్నారు. 

అగ్రికల్చర్‌లో రూ. 7 వేల కోట్లు, డొమోస్టిక్‌లో రూ. 10 వేల కోట్లు కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్న సీఐడీ  దర్యాప్తు అవసరం లేదా? అని ప్రశ్నించారు.  ఏ ఫిర్యాదులేని మార్గదర్శి విశ్వసనీయత దెబ్బతీయటమే లక్ష్యంగా విచారణ చేస్తున్న సీఐడీకి.. ప్రజలు జేబులు దోచుకునే ఇంత పెద్ద కుంభకోణాలు కనబడవా అని ప్రశ్నించారు.  స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 
 

click me!