ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ: ఉద్యోగుల డిమాండ్లు సహా కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Jun 7, 2023, 11:36 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం  ఇవాళ  ఏపీ సచివాలయంలో  ప్రారంభమైంది. ఏపీ సీఎం  వైఎస్ జగన్ అధ్యక్షతన  ఏపీ కేబినెట్ భేటీ సాగుతుంది.  ఉద్యోగుల  సమస్యలపై ఈ సమావేశంలో  చర్చిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం  బుధవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  అధ్యక్షతన   ప్రారంభమైంది.   ఉద్యోగుల  డిమాండ్లతో  పాటు ఇతర కీలక  అంశాలపై  ఏపీ కేబినెట్ లో  ఇవాళ  చర్చిస్తున్నారు. 

రెండు రోజుల క్రితం  మంత్రివర్గ ఉప సంఘంతో  ఉద్యోగ సంఘాలు  సమావేశం  నిర్వహించాయి. ఈ సమావేశంలో  మంత్రివర్గ ఉప సంఘం , ఉద్యోగ సంఘాలకు మధ్య  కుదిరిన అవగాహహనలో  భాగంగా  ఉద్యోగుల సమస్యలను  కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

కాంట్రాక్టు  ఉద్యోగులను  క్రమబద్దీకరించాలని  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.  2014 జూన్  రెండో తేదీ నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టు  ఉద్యోగులను  ఏపీ కేబినెట్  క్రమబద్దీకరించనుంది. ఈ విషయమై కేబినెట్ గ్రీన్ సిగ్నల్  ఇవ్వనుంది. 

ఉద్యోగులకు  కొత్త పీఆర్సీ  విషయమై  కమిటీని ఏర్పాటు  చేయనుంది. దీనికి కేబినెట్  ఆమోదం తెలపనుంది. గతంలో  రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శిగా  పనిచేసిన  సమీర్ శర్మ పేరు పీఆర్సీ  చైర్మెన్ గా  తెరమీదికి వచ్చింది.  అయితే  ఉద్యోగ సంఘాలు  సమీర్ శర్మను  వ్యతిరేకించారు.   దీంతో  ఏపీ ప్రభుత్వ సలహాదారుగా  ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ను  కొత్త పీఆర్‌సీ  చైర్మెన్ గా నియమించే అవకాశం ఉంది. 

ఉద్యోగులకు  చెల్లించాల్సిన  డీఏ  బకాయిలను వచ్చే నాలుగేళ్లలో  16 విడతల్లో   చెల్లించాలని  ప్రభుత్వం  భావిస్తుంది. ఈ విషయమై  కేబినెట్ చర్చించనుంది. శ్రీకాకుళంలో  కిడ్నీ  బాధితుల  కోసం  రాష్ట్ర ప్రభుత్వం  ఆసుపత్రిని  నిర్మించింది. ఈ ఆసపత్రులో  నియామాకాలకు  కేబినెట్  ఆమోదం తెలపనుంది.  చిత్తూరు డెయిరీని  99 ఏళ్ల పాటు అమూల్  సంస్థకు  లీజుకు  కేటాయించే  విషయమై  కేబినెట్  ఆమోదం తెలపనుంది. మరో వైపు  భూ కేటాయింపులు , ఇతర అంశాలపై   కేబినెట్  చర్చించనుంది.
 

click me!