ఫేస్ బుక్ లో పరిచయంతో టీడీపీ నేత లైంగిక వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని బాలిక ఆత్మహత్య..

Published : Oct 06, 2022, 10:21 AM IST
ఫేస్ బుక్ లో పరిచయంతో టీడీపీ నేత లైంగిక వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని బాలిక ఆత్మహత్య..

సారాంశం

ఫేస్ బుక్ పరిచయంతో లైంగిక వేదింపులకు పాల్పడ్డాడో టీడీపీ నేత. ఆ వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

కదిరి : సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది.  ఓ టిడిపి నేత లైంగిక వేధింపులకు బాలిక బలి అయ్యింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రవెల్లి గ్రామంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టిడిపి నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికంగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది.

ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనపై కదిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. 

వికారాబాద్ జిల్లాలో వాగులో చిక్కుకున్న కారు: చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న ఇద్దరు

ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లాలో సెప్టెంబర్ 28న ఇలాంటి ఆత్మహత్య ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతో పాటు అతడి బంధువులు వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోట గండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతులకు కూతురు నూర్జహాన్. అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తర్వాత హైదరాబాదులో కాపురం పెట్టారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్ తో పాటు అత్తమామలు,  ఆడబిడ్డ, ఆమె భర్త కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో నిర్వహించినా..  వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్  గీసుకొండ మండలం వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, మందు తాగే ముందు నూర్జహాన్ సెల్ ఫోన్ లో తన బాధను వీడియో తీసి తెలిసినవారికి వాట్సాప్ లో పెట్టింది.

ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు..
‘నా చావుకు కారణం మాత్రం నా హస్బెండ్, మా ఆడబిడ్డ, మా బావ,  మా అత్తమామలు.. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. క్యాస్ట్ తక్కువని, కట్నంకోసం కొట్టడంతో పాటు చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు.  చాలా పీఎస్ లు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. ఉమెన్ పిఎస్ కు వెళ్ళినా అక్కడ సీఐ సారు వాళ్ళ వద్ద మనీ తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదు. అందుకే చనిపోతున్నా.. నాలాంటి  పరిస్థితి ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి..  ప్లీజ్’ అని ఒక వీడియో లో పేర్కొంది. మరో వీడియోలో ‘అన్నా.. వినయ్ రెడ్డి అన్నా.. థాంక్యూ వెరీ మచ్ అన్నా..  ఒక చెల్లిగా నాకు సహాయం చేసినందుకు థాంక్యూ అన్నా’  అంటూ మరో వీడియో నూర్జహాన్ పోస్ట్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?