దేవరగట్టు కర్రల సమరం.. 50మందికి గాయాలు, వేడుకలకు వెళ్తుండగా బాలుడు మృతి

Published : Oct 06, 2022, 06:41 AM ISTUpdated : Oct 06, 2022, 06:42 AM IST
దేవరగట్టు కర్రల సమరం.. 50మందికి గాయాలు, వేడుకలకు వెళ్తుండగా బాలుడు మృతి

సారాంశం

దసరా సందర్భంగా కర్నూలులోని దేవరగట్టులో కర్రలసమరం ఈ యేడు కూడా జరిగింది. ఈ యుద్ధంలో 50 మంది గాయాలపాలయ్యారు. 

కర్నూలు : ఏపీలోని కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో భాగంగా 50 మంది గాయాలపాలయ్యారు. దసరా రోజున శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి  నిర్వహించే వేడుకల్లో భాగంగా జరిగే ఈ  కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నిర్వహించిన కర్రల సమరంలో 50 మంది భక్తులు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా, ఆ మార్గంలో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పాటు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై మృతి చెందిన బాలుడిని రవీంద్రనాథ్ రెడ్డి గా గుర్తించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడు స్వస్థలం కర్ణాటకలోని శిరుగుప్పగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని  దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దసరా బన్నీ ఉత్సవం సందర్భంగా స్వామి దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. 

దర్శనానికి వచ్చి రాజకీయాలా... దుర్గగుడికి చంద్రబాబు చేసిందేమీ లేదు : మంత్రి కొట్టు సత్యనారాయణ

ఇదిలా ఉండగా, నిరుడు కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర అక్టోబర్ 15 అర్థరాత్రి ప్రారంభమయ్యింది. ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వందమందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. 

దసరా రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకుంటారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో దసరా రోజు కర్రల యుద్ధం ఉత్సవాలు జరిగాయి. ఇందులో తలలు పగలగొట్టుకుని మరి యుద్ధం చేస్తారు. మాళ మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఈ యుద్ధం ఆచారంగా జరుగుతుంది.
ఇక ఈ యేడు కూడా ఈ ఉత్సవం జరిగింది. ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే హింస జరిగింది. ఇటువంటి ఘోరమైన యుద్ధంలో తలలు పగులుతాయని అంతకుముందే మానవ హక్కుల కమిషన్ బాగా సీరియస్ అయ్యాయి. అంతేకాకుండా కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేశారు.

ఇంత హింస జరిగినా కూడా పోలీసులు ఆపలేకపోతున్నారని వారిపై ఆగ్రహం చేస్తున్నారు మానవ హక్కుల కమిషన్. దీంతో ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనే 22 గ్రామాల్లో పోలీసులు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొని భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైట్ల ఏర్పాట్లను కూడా చేశారు. ఈ ఉత్సవం దసరా, ఆ తెల్లవారి రెండు రోజులు వరకు జరుగుతాయి. 

వందేళ్ళ కిందట దేవరగట్టులో వెలసిన మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు విభాగాలుగా విడిపోతారు. ఇక ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఉత్సవమే కర్రల యుద్ధం. ఇందులో పాల్గొనే ప్రజలు కర్రలకు ఇనుప చువ్వను బిగించి ఉత్సవంలో పాల్గొంటారు. కొన్ని కొన్నిసార్లు ఇందులో హింసలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఇది వారి ఆచారమని తెలుస్తుంది. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలకు పైగా జనం తరలి వస్తారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu