బావ దారుణ హత్యతో మనస్థాపం... టిడిపి నేత అంకులు బామ్మర్ది మృతి

By Arun Kumar P  |  First Published Jan 4, 2021, 4:34 PM IST

ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయిన పురంశెట్టి అంకులు ఇంట మరింత విషాదం చోటుచేసుకుంది. 


గుంటూరు: ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయిన టిడిపి నేత పురంశెట్టి అంకులు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అంకులు హత్య నేపద్యంలో మనోవేదనకు గురైన అతడి బామ్మర్ది శ్రీనివాస్ అకస్మాత్తుగా సృహ కోల్పోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. దీంతో దాచేపల్లి మండలం పెదగార్లపాడులో మరింత విషాదం నెలకొంది.

దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ నేతను ప్రత్యర్ధులు హతమార్చారు. ఆయనను పెదగార్లపాడు కు చెందిన పురంశెట్టి‌ అంకుల్‌గా గుర్తించారు.

Latest Videos

పెదగార్లపాడు గ్రామంలో టీడీపీనేతగా వున్న అంకులు.. సర్పంచిగా పదిహేను సంవత్సరాలు సేవలందించారు. గతంలో అంకుల్‌ను పంచాయతీకి పిలిచి ప్రత్యర్థులు గొంతు కోశారు. కానీ ఇప్పుడు అతన్ని అతి కిరాతకంగా హతమార్చారు.

READ MORE  జగన్మోహన్ రెడ్డి అండతోనే టిడిపి నేతల హత్యలు: చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ మాజీ సర్పంచ్ అంకులును దారుణంగా హత్య చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నిందితులను 24 గంటలలోపు అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 

 
  

click me!