కారు ప్రమాదం... మాజీ మంత్రి పుల్లారావుకు తప్పిన ప్రమాదం

Arun Kumar P   | Asianet News
Published : Feb 07, 2021, 11:46 AM ISTUpdated : Feb 07, 2021, 11:56 AM IST
కారు ప్రమాదం... మాజీ మంత్రి పుల్లారావుకు తప్పిన ప్రమాదం

సారాంశం

 ఇవాళ(ఆదివారం) ఉదయం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. 

గుంటూరు: మాజీ మంత్రి, టిడిపి నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు ఫెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. చిలకలూరిపేట-నరసరావుపేట మధ్యలో ఆయన వెళుతున్న కారు మరో కారు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదం నుండి ప్రత్తిపాటి పుల్లారావు సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. 

ఈ ప్రమాదంలో తనకెలాంటి గాయాలు కాలేవని మాజీమంత్రి ప్రత్తిపాటి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పుల్లారావు  తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పత్తిపాటి అభిమానులు, నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu