పన్నులు, ధరలు, అప్పలు పెంచడం ద్వారా ప్రతి కుటుంబంపై రూ.2లక్షలు భారం మోపిన వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.
గుంటూరు: రైతులకు రూ.2 వేల కోట్లు బకాయిలు పెట్టినందుకు వైసీపీకి ఓటేయాలా? అని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. రైతుల బోర్లకు మీటర్లు పెట్టే వైకాపాకు ఎందుకు ఓటెయ్యాలి? పన్నులు, ధరలు, అప్పలు పెంచడం ద్వారా ప్రతి కుటుంబంపై రూ.2లక్షలు భారం మోపిన వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి? అని ప్రజలు అడిగే ఈ ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని కళా డిమాండ్ చేశారు.
కళా వెంకట్రావు ప్రభుత్వానికి సంధించిన మరికొన్ని ప్రశ్నలు:
1. 4, 5 విడతల రైతు రుణమాఫీ ఎగ్గొట్టి 32 లక్షల మంది రైతులకు అన్యాయం చేసినందుకు, సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వనందుకు వైకాపా కి ఓట్లు వెయ్యాలా?
2. కోటి మంది రైతులున్నారు ప్రతి రైతుకి పెట్టుబడి రాయితీ కింద ఏడాదికి రూ .12,500 ఇస్తామని అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే రూ.6వేలకు రూ.7,500 మాత్రమే కలిపి రూ.18,500 ఇవ్వాల్సి ఉండగా రూ.13,500 ఇచ్చి సగం మంది రైతులకే ఇస్తున్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు, ఐదేళ్లలో రూ.30 వేలు ఎగనామం పెట్టినందుకు ఓటేయాలా?
3. విద్యుత్తు చార్జీలు పెంచనని రూ.1300 కోట్లు, ఆర్టీసీ ఛార్జీలు పెంచనని ఆర్టీసీ చార్జీలు రూ 800 కోట్లు పెంచి నందుకు,డీజీలు,పెట్రోలు పన్నులు తగ్గిస్తానని పెంచినందుకు,ఆస్తి పన్నులు వంటి అనేక భారాలు మోపి 20 నెలల్లో రూ.2 లక్షల కోట్ల భారం వేసినందుకు వైకాపాకి ఓట్లు వెయ్యాలా?
4. టీడీపీ తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుక కొరత సృష్టించి 30 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడి, 100 మంది నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు, నిర్మాణరంగాన్ని కుదేలు చేసినందుకు వైకాపాకి ఓట్లు వెయ్యాలా?
5. అమ్మ ఒడి పధకం ద్వారా అమ్మ లందరికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 80 లక్షల మంది అమ్మలకు రూ 15 వేలు ఇవ్వాల్సి ఉండగా 43 లక్షల మందికి తగ్గించి అమ్మలను మోసం చేసినందుకు వైకాపాకి ఓట్లు వెయ్యాలా?
6. ఆరు లక్షల మంది యువతకు నెలకు రూ.2వేల చొప్పున గత ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్టకొట్టినందుకు, 45 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇవ్వనందుకు వైకాపాకి ఓట్లు వెయ్యాలా?
7. ఇరవై అయిదు మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తెస్తానని,పరిశ్రమలు వస్తాయని,ఉద్యోగాలు వస్తాయని యువతలో గంపెడు ఆశలు నింపి అధికారంలోకి వచ్చాక బీజేపీ కే ఫుల్ మెజారిటీ వచ్చినది హోదాపై నేను ఏమి చేయలేను ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉంటాను అంటూ మాటమార్చి హోదా పై చేతులెత్తేసినందుకు,యువతని మోసం చేసినందుకు జగన్ కి ఓటు వెయ్యాలా?
8. అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి అంగీకరించి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలు చేయడానికి పూనుకొని 33 వేల ఎకరాలు భూములుఇచ్చిన 29వేల మంది రైతులను మోసం చేసినందుకు జగన్ ఓట్లు వేయాలా?
9. ప్రభుత్వ కార్యాలయాలకు పంచాయితీ లకు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు వైకాపా రంగులు వేయండం, కోర్టు ఆదేశాలతో రంగులు తొలగించినందుకు ప్రజాధనం రూ.4వేల కోట్లు ఖర్చు చేసినందుకు జగన్ కి ఓట్లు వెయ్యాలా?
10. ఇళ్ల స్థలాల పేరుతొ పచ్చని పంట పొలాలను,దళితుల,బడుగులకు చెందిన 10 వేల ఎకరాలు అసైన్డు భూములు బలవంతంగా గుంజుకొని బడుగుల జీవనాధారాన్ని దెబ్బతీసినందుకు వైకాపా కి ఓట్లు వెయ్యాలా?
11. బీసీల పట్ల దారుణంగా వ్యవహరించి 34 శాతం రిజర్వేషన్ ను 24 శాతానికి తగ్గించి బిసిలకు 16 వేల పదవులకు గండి కొట్టి బిసిలను రాజకీయంగా అణగ తొక్కినందుకు వైకాపాకి ఓట్లు వేయాలా?
12. 20 నెలల్లో ఎక్కడా ఒక్క తట్ట మట్టి తీయకుండా,ఒక్కబొచ్చెడు కాంక్రీట్ వెయ్యకుండా చేసిన అభివృద్ది లేకుండా 20 నెలల్లో లక్షా 40 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్నిఅప్పులకుప్పగా మార్చి నందుకు వైకాపాకు ఓటు వెయ్యాలా?
13. రోజుకు మూడు కోట్ల మందికి పైగా అభాగ్యుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాoటీన్ల ను రద్దు చేసి వారి పొట్టకొట్టి నందుకు వైకాపా కి ఓట్లు వెయ్యాలా?
14. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని నిర్వహించనందుకు, ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తానని ఇవ్వనందుకు జగన్ కి ఓటు వెయ్యాలా?
15. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెయ్యనందుకు,సన్నబియ్యం ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసినందుకు జగన్ కి ఓటు వెయ్యాలా?
16. కాపు రిజర్వేషన్లు రద్దు చేసినందుకుకాంట్రాక్టు ఉధ్యోగులను క్రమ బద్దీకరణ చేస్తానని చెయ్యనందుకు వైసిపి కి ఓటు వెయ్యాలా?
17. డ్వాక్రా రుణాళు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక డ్వాక్రా రుణాలు మాఫీ చెయ్యనందుకు జగన్ కి ఓటు వెయ్యాలా?
18. భూ మాఫియా,ఇసుక మాఫీయా,గనుల మాఫీయా,మధ్యం మాఫీయా ఇష్టాను సారం దోపిడి చేస్తున్నందుకు. సెంటు పట్టా పేరుతో రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడినందుకు వైసీపీకి ఓటు వెయ్యాలా ?