చంద్రబాబు విచారణ ఫోటోలు, వీడియోలు లీక్... వైసిపి కుట్రలో భాగమే : పట్టాభిరాం

By Arun Kumar PFirst Published Sep 10, 2023, 9:29 AM IST
Highlights

చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విచారిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంపై టిడిపి నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 

విజయవాడ : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న సిఐడి భారీ పోలీస్ బందోబస్తు మధ్య విజయవాడకు తరలించారు. సిట్ కార్యాలయంలో ఆదివారం 3గంటల వరకు సిఐడి అధికారులు చంద్రబాబును విచారించారు. 

అయితే చంద్రబాబును విచారిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంపై టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిఐడి అధికారులు వైసిపి అనుకూల మీడియాసంస్థ సాక్షి ఫోటో గ్రాఫర్, కెమెరామెన్ ను చంద్రబాబును విచారిస్తుండగా ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఈ విచారణ ఫోటోలు, వీడియోలు బయటపెట్టి చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వైసిపి కుట్రలో సిఐడి భాగస్వామ్యం  కావడం దారుణమని పట్టాభిరాం అన్నారు. 

అవినీతి, అక్రమాలపై సిఐడి అధికారులు విచారిస్తుంటే చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారంటూ దుష్ప్రచారం చేసేందుకే ఫోటోలు, వీడియోలు తీసారని పట్టాభిరాం ఆరోపించారు. విచారణ ఫోటోలు, వీడియోల లీక్ వెనక వైసిపి హస్తం వుందన్నారు. ఏ మీడియా సంస్థలను విచారణ గదిలోకి అనుమతించని సిఐడి అధికారులు కేవలం సాక్షి ప్రతినిధులను అనుమతించడం కుట్రలో భాగమేనని పట్టాభిరాం ఆరోపించారు. 

Read More  నేను ఏ తప్పు చేయలేదు.. రాజకీయ కక్షతోనే అభియోగాలు: ఏసీబీ కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు

సిఐడి అధికారులు తాడేపల్లి ప్యాలస్ ఆదేశాలతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని పట్టాభిరాం అన్నారు. సీఎం జగన్ చేతిలో సిఐడి అధికారులు కీలుబొమ్మల్లా మారిపోయారని పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేసారు. 

click me!