ఏపీలో 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం నేత పట్టాభి. తమవారిపైనే వైసీపీ మూకలు దాడులు చేసి.. ఏమీ తెలియనట్లు ఫిర్యాదులు చేస్తున్నాయని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైసీపీ మూకలు జైలుకు వెళ్లడానికి సిద్ధం కావాలని హెచ్చరించారు.
ప్రజలు మక్కెలు విరగొట్టి 11సీట్లతో మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ నేతల అరాచకాలు ఆగడంలేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్‌ను వైసీపీ మూకలు దారుణంగా హతమార్చాయని మండిపడ్డారు. రాష్ట్రంలో హింసకు వైసీపీ పిల్ల సైకోలే కారణమని ఆరోపించారు. అయినా, పేర్ని నాని, కొడాలి నానిలు నంగనాచిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలను చంపడం, వారిపై దాడుదలు చేయడమే ప్రజాస్వామ్యమా అని వైసీపీని ప్రశ్నించారు. చంద్రబాబుపై, తనపై దాడులు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని నిలదీశారు. మాచర్లలో బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందన్నారు. టీడీపీ నేతల పీకలు కోసినప్పుడు ప్రజాస్వామ్యం కనిపించలేదా అంటూ పట్టాభి దుయ్యబట్టారు. తమ పార్టీ నాయకుడు గాంధిపై దాడి చేసి కన్ను పోగొట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అరాచకాలు చేసి... మళ్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గరవర్నర్ వినతులు ఇస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ అని, చంద్రబాబు హింసను ప్రోత్సహించరని స్పష్టంచేశారు. కూటమి పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కట్టుబడి ఉన్నాయయని.... రాష్ట్రంలో ఎక్కడా భౌతికదాడులు జరగవు.. వైసీపీ నేతలు తడుపుకోవాల్సిన పనిలేదని అని పట్టాభి చెప్పారు. ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామని... తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. నారా లోకేశ్ రెడ్ బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తామన్న పట్టాభి... వైసీపీ మూకలు జైలుకు వెళ్లడానికి సిద్ధం కావాలని వ్యాఖ్యానించారు.
పట్టాభి ఇంకా ఏమన్నారంటే...
‘‘గత ఐదు సంవత్సరాలు సైకోలుగా ముద్ర వేయించుకున్న వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి నంగనాచులుగా మాట్లాడుతున్నారు. ఏపాపం ఎరుగునట్లు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జూన్ నాలుగు నియంత పాలనకు ముగింపు పలికిన రోజు. ఆరోజు రాష్ట్ర ప్రజలు దీపావళి జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా నారా చంద్రబాబు అను నేను అనే వ్యాఖ్యం వినడానికి ఎదురు చూస్తున్నారు. ఆరోజు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో తమపై దాడులు జరుగుతున్నాయని పిల్లసైకోలు అప్పుడే ఏడవడం, రకరకాల డ్రామాలు మొదలు పెట్టారు.’’
‘‘జరుగుతున్న వాస్తవాలు గమనిస్తే కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నాయకుడు గిరనాథ్ చౌదరిని నిన్న అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై వైసీపీ మూకలు హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హింసను ప్రేరేపిస్తున్నది ఎవరు? ఈ దారుణ హత్యకు ఏం సమాధానం చెబుతారు ఈ పిల్ల సైకోలు. నంగనాచిలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న గుడివాడ నాని, పేర్ని నానిలు ఇప్పుడు ఏం చెబుతారు. రాష్ట్రంలో హింసకు కారణం వైసీపీ సైకో మూకలే. కౌంటింగ్ రెండు రోజులు ముందు గంటలు లెక్కపెట్టుకుని రా మీ సంగతి తెలుస్తామంటూ పేర్ని మాట్లాడాడు.. దీన్ని బట్టే వైసీపీ నేతల తీరు ఎంటో తెలుస్తుంది. ఒక పక్క ప్రజలు 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్లపై కూర్చోబెట్టినా ఇంకా బుద్ది తెచ్చుకోకుండా దారుణాలు, హత్యలు, సైకో చేష్టలు కొనసాగిస్తూ.. నంగనాచిలా వచ్చి మాట్లాడుతున్నారు. గవర్నర్ వద్దకు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ . సిగ్గులేకుండా విన్నపాలు చేస్తున్నారు. టీడీపీ నేతలను దారుణంగా హతమార్చడమా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే ? టీడీపీ నేతలను కిరాతకంగా చంపడాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? ఐదు సంవత్సరాలు వైసీపీ నేతలు చేసిన పాపాల పర్యావసానమే జూన్ 4 ఫలితం. సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వస్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కలేదు. నిజమైన దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4న చూపించాడు ఆ భగవంతుడు.’’
‘‘మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఈరాష్ట్రానిక ఒక కలంకం. అందుకే మధ్యలో ఉన్న 5 అంకెను చెరిపేసి కేవలం 11 మాత్రమే ఉంచాడు ఆ భగవంతుడు. టీడీపీ పార్టీ ప్రాజాస్వామ్యాన్ని గౌరవించేపార్టీ.. కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాయి. అటు వంటి మాకు ప్రాజాస్వామ్యం గురించి చెప్పే హక్కు మీకు లేదు. ఇటువంటి దారుణాలకు ఒడిగడుతూ... ప్రజాస్వామ్యాన్నిగురించి మాట్లాడుతారా సిగ్గులేకుండా. చంద్రబాబు బాబు మాకు ఒక క్రమశిక్షణను అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువలు గురించి మాకు హితబోద చేశారు. వైసీపీ సైకో మూకలు ప్యాయింట్లు తడుపుకోవాల్సిన అవసరంలేదు. అయ్యో బాబు అంటూ నేడు పిల్ల సైకోలు గుండెలు బాదుకుంటున్నారు. పిల్ల సైకోలకు టీడీపీ తరఫున హామీ ఇస్తున్నాం.. మీరు ప్యాయింట్లు తడుపుకోవద్దు. రాష్ట్రంలో ఎక్కడా కూడా బౌతిక దాడులు జరగవు.. మీ ఇళ్లపై దాడులకు తెగబడరు, మీ కుటుంబ సభ్యులను ఎవరూ భయపెట్టరు. మేము హింసను ప్రేరేపించం... ఆ మార్గం మాది కాదు. కానీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం... దాంట్లో ఎక్కడా రాజీ పడం... ఐపీసీ సెక్షన్ ల పవర్ చూపిస్తాం. లోకేష్ గారి రెడ్ బుక్ లో నమోదు అయిన పిల్లసైకోలు, అవినీతిపరులైన అధికారుల అందరి సంగతి తేలుస్తాం.. చట్టానికి లోబడి గట్టిగా బుద్ధి చెబుతాం. రెడ్ బుక్ ను రియాల్టీలోకి తెస్తాం.’’
’’ దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడిచేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా అందరికి తండ్రిలాంటి వ్యక్తి నారా చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మాచర్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడిచేసినప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు రాళ్లు, కర్రలతో దాడి చేసి అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం ఏంటో? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా దాడులను కట్టడిచేయాల్సిన వ్యక్తి మాకు బీపీలు రావా అన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? తోటా చంద్రయ్యను అత్యంత కిరాతకంగా పీక కోసి చంపినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? కంచర్ల జర్లయ్య, కిరణ్, డాక్టర్ సుధాకర్, అమర్నాధ్, అబ్దుల్ సలాం లాంటి వ్యక్తులను దారుణంగా హతమార్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? చెన్నుపాటి గాంధీ పై సెప్టెంబర్ 2022 లో దాడి చేసి ఆయన కన్ను పోగొట్టారు.. ఆయన కంటి చూపు పోవడానికి కారణమైన మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, నందిగామలలో చంద్రబాబుపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మీకు కొమ్ముకాస్తున్న పోలీసులతో గొడలు దూకించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కొల్లు రవీంద్రపై లేనిపోని నిందలు మోపి ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా ఇంటిపై దాడి చేసి నా బిడ్డను భయబ్రాంతులకు గురిచేసి నా ఇంటిని ధ్వంసం చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది. నడిరోడ్డులో నా కారును ధ్వంసం చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికిపోయింది. నారా లోకేష్ పాదయాత్రపై 22 సార్లు దాడులు చేశారు. అమరావతి రైతులుపాదయాత్ర చేస్తుంటే రాజమండ్రిలో వారిపై పెట్రోల్ పోశారు. కనదుర్గమ్మ దర్శనానికి వెళితే మహిళలపై రక్తం వచ్చేలా దాడులు చేశారు. మా నాయకుడు లోకేష్ ను కనకదుర్గమ్మ వారధిపై ఐదు గంటల పాటు బంధించినప్పుడు ప్రజాస్వామం ఎక్కడికి పోయింది?’’
‘‘వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి వెళితే సీబీఐ అధికారులపై దాడిచేసినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? చరిత్ర అప్పుడే చరిగిపోతుందనుకునారా? అప్పుడే మరిచిపోతారనుకున్నారా? తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎన్ని సార్లు దాడులు చేశారు.. ఆరోజు ప్రజాస్వామ్యం ఏమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడులో గ్రామాలకు గ్రామాలు ఖాళీచేయించి పారిపోయేలా చేశారు. బాధితుల కోసం మేం గుంటూరులో పుణరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇవాళ మళ్లీ మీరు మాకు పాఠాలు చెబుతారా సిగ్గులేకాండా. కౌంగింట్ రోజు దాదాపు 13 చోట్ల దాడులు చేశారు. పిల్లసైకోలు అవినాష్, కొడాలినాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లను ఎవరిని వదిలిపెట్టం. మీరు ఇక నేల మీద పడుకోవడం, దొడ్డుబియ్యం తినడం, ఇండియన్ టాయిలెట్ ను అలవాటు చేసుకోవాలి. రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానం అక్కడ వారానికి రెండుసార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. సెల్ ఫోన్ మాట్లాటం మానేయండి ఇవన్నీ అక్కడ కుదరదు. సాయత్రం 6 తరువాత ఏదోక గదిలోకి వెళ్లి మీకు మీరే తలుపులు వేసుకోవడం అలవాటు చేసుకోండి.. ఎందుకంటే జైలుకు వెళితే అదే పరిస్థితి మీకు.’’
‘‘అవినాష్ నా ఇంటి మీదకు వచ్చి దాడి చేశాడు. నా బిడ్డను భయపెట్టాడు. అవినాష్ అనేపిల్ల సైకో చేసిన పాపాలకు అతను అనుభవించక తప్పదు. జగన్ రెడ్డి కూడా నెలమీద పడుకోవడం, దొడ్డు అన్నం తినడం, ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకుంటే మంచిది. ఎవరిని వదిలి పెట్టే ప్రశక్తి లేదు... నిజమైన ఐపీఎస్, నిజమైన పోలీసులు అధికారులు డ్యూటీలో ఉంటే ఏరకంగా ఉంటుందో రుచిచూపిస్తాం. పిల్ల సైకోలు ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకొస్తాం.. ఎవరిని వదిలిపెట్టం. ప్యాంట్లు తుడుచుకోవడం కష్టంగా ఉంటే డైపర్లు కొని పంపిస్తాం. చట్టానికి భయపడి తీరాల్సిందే. మీరు చేసిన పాపాల చిట్టా అంత మా దగ్గర ఉంది. అవి అన్నీ బయటకు తీసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు.’’
‘‘పోలీసులు ఏమి యాక్షన్ తీసుకోవడంలేదని నంగనాచుల్లా మాట్లాడుతున్నారు. మీరు పోలీసులపై చేసిన దుర్మార్గాలు ఏంటి... చిత్తూర జిల్లాలో యర్రచందనం స్మగ్లర్లు పోలీస్ కానిస్టేబుల్ ను గుద్ది చంపారు ఆరోజు గుర్తుకు రాలేదా పోలీసులు. నంద్యాలలో గూడూరు నరేంద్ర కుమార్ ను అత్యంత దారుణంగా చంపినప్పుడు పోలీసులు గుర్తుకు రాలేదా? కృష్ణాజిలా పమిడిముక్కలలో మట్టితవ్వకాలను అడ్డుకున్న పోలీసులపై అక్కడ ఉన్న వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజు పోలీసులు గౌరవం గుర్తుకు రాలేదా మీకు? నందిగామ సురేష్ కృష్ణ లంక పోలీస్ స్టేష్ కు వెళ్లి దౌర్జన్యం చేసి అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేసినప్పుడు పోలీసులు గుర్తుకు రాలేదా? సిదిరి అప్పల రాజు అరేనా కొడకా ఏమి తమాషాలు చేస్తున్నావని అని పోలీసులను దుర్భాషలాడిప్పుడు మీకు ఖాకీ యూనిఫామ్ గౌరవం గుర్తుకు రాలేదా? కుప్పం నియోజకవర్గంలో సీఐ సాధిక్ పై జరిగిన దాడి మరచిపోయారా? గురజాల మాజీ ఎమ్మెల్యే ఏంటి బొంగులో పోలీస్ అన్నప్పుడు పోలీసుల మర్యాద గుర్తుకురాలేదా? వెలగపూడి రామకృష్ణ ఆఫీసుపై దాడి జరిగిప్పుడు పోలీసులు అడ్డుకుంటే వారిపై దాడి చేశారు అప్పుడు పోలీసులు గుర్తుకు రాలేదా? పోలీసుల గౌరవం గురించి, పోలీసుల మర్యాద గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.’’
‘‘చంద్రబాబు పాలనలోనే పోలీసులకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది టీడీపీ పాలనలోనే. నిజమైన పోలీసుల పవర్ ఏంటో, నిజమైన పోలీసుల లాఠీ పవర్ ఎంటో మీరు చూస్తారు. మేము కచ్చితంగా ఆ రూట్ లోనే వెళతాం. ఎక్కడా హింసకు పాల్పడే ప్రశక్తి ఉండదు. మా నాయకుడు అటువంటి చర్యలను ప్రోత్సహించరు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కావాలి. ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. చట్టబద్ధంగా వ్యవహరిస్తాం. చట్టం పవరేంటో చూపిస్తాం... సైకో మూకలను ఎవరిని వదిలిపెట్టకుండా బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. సాక్ష్యాలు సేకరిస్తున్నాం.. ప్రతి ఒక్కరి లెక్క తెలుస్తాం. చంద్రబాబు పాలనలో పెట్టుబడులు వస్తాయి. ప్రజలు సంతోషంగా ఉంటారు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చుదిద్దుకుందాం. సైకో మూకలకు బుద్ధి చెబుదాం’’ అని పట్టాభి పేర్కొన్నారు.