పరిటాల శ్రీరామ్‌కి డబుల్ ప్రమోషన్: ఒకే రోజూ రెండు శుభవార్తలు

Published : Nov 06, 2020, 01:07 PM ISTUpdated : Nov 06, 2020, 02:14 PM IST
పరిటాల శ్రీరామ్‌కి డబుల్ ప్రమోషన్: ఒకే రోజూ రెండు శుభవార్తలు

సారాంశం

మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కి ఒకే రోజునే డబుల్ ప్రమోషన్ దక్కింది. ఒకే రోజు శుభవార్తలు దక్కడంతో శ్రీరామ్ అభిమానులు ఉబ్బితబ్బియ్యారు. సోషల్ మీడియాలో శ్రీరామ్ ను అభినందిస్తున్నారు.


అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కి ఒకే రోజునే డబుల్ ప్రమోషన్ దక్కింది. ఒకే రోజు శుభవార్తలు దక్కడంతో శ్రీరామ్ అభిమానులు ఉబ్బితబ్బియ్యారు. సోషల్ మీడియాలో శ్రీరామ్ ను అభినందిస్తున్నారు.

also read:219 మందితో అచ్చెన్నాయుడు టీమ్: ఏపీ టీడీపీ కమిటీ ప్రకటన

పరిటాల శ్రీరామ్ సతీమణి  జ్ఞాన శుక్రవారం నాడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

పరిటాల కుటుంబానికి అభిమానులు పరిటాల రవి మళ్లీ పుట్టాడని శ్రీరామ్ ను అభినందిస్తున్నారు. ఈ వార్త విన్న కొద్దిసేపటికే  టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీరామ్ ను టీడీపీ నియమించింది. ఒకే రోజు రెండు శుభవార్తలు వినడం పట్ల పరిటాల అభిమానులు ఆనందిస్తున్నారు.

 

2014 ఎన్నికలకు ముందు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో రాఫ్తాడు నుండి శ్రీరామ్ పోటీ చేసినా వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యాడు.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో ఈ నియోజకవర్గ బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబునాయుడు అప్పగించారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu