టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్.. వారంతా జాగ్రత్తగా ఉండాలని ట్వీట్..

By Sumanth KanukulaFirst Published Jan 14, 2022, 1:41 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌‌కు (Paritala Sreeram) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌‌కు (Paritala Sreeram) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని శ్రీరామ్ చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. 

‘కరోనా పరీక్షలో స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలూ అందరూ జాగ్రత్తగా ఉండి, ఏమైనా లక్షణాలు కనబడితే టెస్టు చేయించుకుని జాగ్రత్త పండాల్సిందిగా తెలియజేస్తున్నానను’ అని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. 

ఇక, ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో47,884 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 4348  మందికి కరోనా నిర్ధారణ అయింది.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,92,227కి చేరింది. తాజాగా కరనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14,507కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

అనంతపురం విషయానికి వస్తే.. జిల్లాలో కొత్తగా 230 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,59,214కి చేరుకుంది. జిల్లాలో ప్రస్తుతం 808 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 1,57,313 మంది కరోనా నుంచి కోలుకున్నాయి. జిల్లాలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,093గా ఉంది.. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
 

click me!