ఏపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఆర్కే‌తో చేయి కలిపిన లోకేశ్

Siva Kodati |  
Published : Jun 18, 2019, 10:46 AM ISTUpdated : Jun 18, 2019, 11:05 AM IST
ఏపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఆర్కే‌తో చేయి కలిపిన లోకేశ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసిన వైసీపీ నేత ఆర్కే, టీడీపీ నేత నారా లోకేశ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసిన వైసీపీ నేత ఆర్కే, టీడీపీ నేత నారా లోకేశ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.

అసెంబ్లీ లాబీలోని వైఎస్‌ఆర్‌ఎల్పీ కార్యాలయం వద్ద ఆర్కే కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో శాసనసమండలి సమావేశానికి వెళుతున్న లోకేశ్.. ఆర్కేను చూసి పలకరించారు.

ఎన్నికల్లో విజయం సాధించినందుకు షేక్ హ్యాండిచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో గానీ, అంతకు మందు కానీ ఇద్దరు నేతలు ఎదురుపడ్డ సందర్భం లేదు.  

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో లోకేశ్‌పై రామకృష్ణారెడ్డి 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదట్లో ఆళ్లకు గట్టి పోటి ఇచ్చిన లోకేశ్.. ఆ తర్వాత ఆధిక్యం విషయంలో వెనకబడుతూ వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu