నాకు ఇంకో పెళ్లయ్యిందట.. సంతోష్ అనే కొడుకున్నాడట, మా ఇంట్లో విషాదాన్నీ వదల్లేదు : వైసీపీపై నారా లోకేష్

By Siva KodatiFirst Published Aug 10, 2022, 6:58 PM IST
Highlights

తనపై చేస్తోన్న దుష్ప్రచారంపై వైసీపీ నేతలకు క్లాస్ పీకారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాకు మరో పెళ్ళి జరిగిందని.. సంతోష్ అనే కొడుకు ఉన్నాడని తప్పుడు ఆరోపణలు చేసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళలపై తప్పుగా ప్రవర్తించడం వైసిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అరె ముండా అని అసెంబ్లీలో అంటే సీఎం ఎందుకు స్పందించలేదని లోకేష్ నిలదీశారు. నాకు మరో పెళ్ళి జరిగిందని.. సంతోష్ అనే కొడుకు ఉన్నాడని తప్పుడు ఆరోపణలు చేసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మా ఇంట్లో దురదృష్టకర సంఘటన జరిగినా రాజకీయం చేశారని... కుప్పంలో చంద్రబాబు (chandrababu naidu), మంగళగిరి తాను తప్పకుండా పోటీ చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. 

దేని ఆధారంగా అనంతపురం ఎస్పీ ఎంపీ గోరంట్ల వీడియో (gorantla madhav) ఫేక్ ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో చూపించాలని.. సజ్జల నాలుగు గోడల మధ్య జరిగిందన్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అసలు వీడియో గోరంట్లది కాదు అని చెబుతున్నారని.. ఎస్పీ ఎలా ప్రకటిస్తారని, ఆయనేమైనా ఫోరెన్సిక్ నిపుణుడా అని నారా లోకేష్ ఫైరయ్యారు. దీనికైనా ఓ సిస్టమ్ , ప్రోసిజర్  అంటూ ఉంటుంది కదా అని ఆయన అన్నారు. ఐదు రోజుల తర్వాత ఫేక్ అని చెప్పడం హస్యస్పదమని... అంబటి రాసలీలలు (ambati rambabu) కూడా ఫేక్ అంటారా అంటూ దుయ్యబట్టారు. మంత్రి అవంతి (avanthi srinivas) చేసింది కూడా  కాదు అంటారా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. 

ALso REad:గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం .. ఆయనేమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా : అనంత ఎస్పీపై నారా లోకేశ్ విమర్శలు

అంతకుముందు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని , ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని స్పష్టం చేశారు. ఈ వీడియోపై ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. 

తొలుత ఈ వీడియో ITDP Official అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి +447443703968 నెంబర్ నుండి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు. ఈ ఫోన్ నెంబర్ యూకేకు చెందిన వోడాఫోన్ నెంబర్ అని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ నెంబర్ ఉపయోగిస్తుంది ఎవరనే విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. యూకే నుండి పోస్టు చేసిన వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉందని ...ఈ ఫోన్ ఎవరు వాడుతున్నారనే విషయమై వివరాలు ఇవ్వాలని వొడాఫోన్ ను కూడా సమాచారం కోరినట్టుగా ఫకీరప్ప చెప్పారు. 

ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుతుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోని వీడియో ఎడిటింగ్ లేదా మార్పింగ్ చేశారనే సందేహలున్నాయని ఫకీరప్ప పేర్కొన్నారు. 

click me!