ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ చొక్కా తొడుక్కున్నారు.. పోలీసులపై నారా లోకేశ్ ఆరోపణలు

By Siva Kodati  |  First Published Oct 9, 2021, 2:29 PM IST

వైసీపీ (ysrcp) ప్ర‌భుత్వం, పోలీసుల‌పై (ap police) టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ (nara lokesh) మండిప‌డ్డారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి (west godavari) జిల్లా చింతలపూడి (chinthalapudi) నియోజకవర్గం పరిధిలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.


వైసీపీ (ysrcp) ప్ర‌భుత్వం, పోలీసుల‌పై (ap police) టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ (nara lokesh) మండిప‌డ్డారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి (west godavari) జిల్లా చింతలపూడి (chinthalapudi) నియోజకవర్గం పరిధిలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

'ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ చొక్కా తొడుక్కున్న కొంతమంది పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒడ్డు దాటాక సొంత కుటుంబ సభ్యులను సైతం దూరం పెట్టే వైసీపీ వాళ్ల‌ను నమ్ముకొని అక్రమ కేసులు బనాయిస్తున్న కొంతమంది పోలీసులు, చట్టవ్యతిరేకంగా చేస్తోన్న తప్పులకు మూల్యం చెల్లించక తప్పదు' అని ఆయ‌న హెచ్చ‌రించారు.

Latest Videos

ALso Read:పిచ్చి తుగ్లక్ అని చదువుకున్నా.. ఇప్పుడు జగన్‌ని చూస్తున్నా, వైసీపీ పోతేనే ఏపీ అభివృద్ధి: చంద్రబాబు

'పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం పరిధిలో టీడీపీ జడ్పీటీసి అభ్యర్థిగా పోటీ చేశారనే అక్కసుతో గంధం జగన్నాథం గారిపై అక్రమ కేసులు బనాయించి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'వైసీపీ నాయకుల ప్రోద్బ‌లంతో పెట్టిన కేసులు వెంటనే ఎత్తెయ్యాలి. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

 

ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ చొక్కా తొడుక్కున్న కొంతమంది పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒడ్డు దాటాక సొంత కుటుంబ సభ్యులను సైతం దూరం పెట్టే వైసీపీ వాళ్ళను నమ్ముకొని అక్రమ కేసులు బనాయిస్తున్న కొంతమంది పోలీసులు, చట్టవ్యతిరేకంగా చేస్తోన్న తప్పులకు మూల్యం చెల్లించక తప్పదు.(1/3) pic.twitter.com/NLjkHZldOI

— Lokesh Nara (@naralokesh)
click me!