ఆ కౌలురైతు వైసిపి అభిమానే...సూసైడ్ నోట్ లో ఏముందంటే...: లోకేష్ ఆవేదన

By Arun Kumar PFirst Published Jan 20, 2021, 11:31 AM IST
Highlights

చందర్లపాడు పట్టణంలో కట్టా లక్ష్మీనారాయణ అనే రైతు కౌలు పొలంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్న ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికన స్పందించారు. 

విజయవాడ: అసలే అకాల వర్షాలకు పంట నష్టపోయి, దిగుబడి లేక కనీసం పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితుల్లో ఓ కౌలు రైతుకు మార్కెటింగ్ అధికారుల తీరు మరింత మనస్థాపానికి గురిచేసింది. పండించిన పంటను బయ్యర్లతో కుమ్మక్కయి అధికారులు గిట్టుబాటుధర ఇవ్వకపోవడంతో సదరు కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో మరంత మనోవేధనకు గురయిన రైతు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషాద సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.  

చందర్లపాడు పట్టణంలో కట్టా లక్ష్మీనారాయణ అనే రైతు కౌలు పొలంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్న ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికన స్పందించారు. వైసిపి అభిమాని ఇలా వైసిపి ప్రభుత్వ చర్యల వల్ల చనిపోతే మిగతా రైతుల పరిస్థితి మరెంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు లోకేష్.

''జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఇన్స్యూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని వైఎస్ జగన్ ఘోరంగా మోసం చేసారు'' అని లోకేష్ ఆరోపించారు.

read more కౌలు పొలంలోనే... పెట్రోల్ పోసుకుని అన్నదాత ఆత్మహత్య
 
''కృష్ణా జిల్లా చందర్లపాడులో అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు కట్టా లక్ష్మినారాయణ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆత్మహత్యలు చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
''వైకాపా అభిమాని అయిన కౌలు రైతు లక్ష్మీనారాయణ జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
 

click me!