పాలబాటిల్ నోట్లో కుక్కి.. పసికందును చంపిన కిరాతక తండ్రి..

Published : Jan 20, 2021, 10:46 AM IST
పాలబాటిల్ నోట్లో కుక్కి.. పసికందును చంపిన కిరాతక తండ్రి..

సారాంశం

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మత్తులో కన్న బిడ్డనే కర్కశంగా చంపేశాడో కిరాతక తండ్రి. ముక్కుపచ్చలారని పసికందును కన్నతల్లి ఎదుటే కిరాతకంగా కడతేర్చిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. 

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మత్తులో కన్న బిడ్డనే కర్కశంగా చంపేశాడో కిరాతక తండ్రి. ముక్కుపచ్చలారని పసికందును కన్నతల్లి ఎదుటే కిరాతకంగా కడతేర్చిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన బాల్‌రెడ్డి అలియాస్‌ బాలరాజు, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన లక్ష్మి అనాథలు. వీరు ప్లాస్టిక్‌ కాగితాలు, బాటిళ్లు ఏరుకుంటూ జీవిస్తారు. కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. 

ఈ క్రమంలో లక్ష్మి గర్భం దాల్చింది. గత కొంత కాలంగా వీరు జూపాడుబంగ్లాకు చేరుకున్నారు. ఇక్కడి బస్టాండు సమీపంలోని కేసీ కాల్వ విశ్రాంతి భవనం ప్రాంగణంలో నివాసముంటున్నారు. 

రెండు నెలల క్రితం లక్ష్మి పండంటి ఆడబిడ్డ(దుర్గ)కు జన్మనిచ్చింది. ఆమె పాపతో విశ్రాంతి భవనంలో ఉండగా బాల్‌రెడ్డి ప్లాస్టిక్‌ బాటిళ్లు ఏరుకొని విక్రయించటం, వ్యవసాయ కూలిపనులకు వెళ్లటం ద్వారా వచ్చే డబ్బుతో లక్ష్మి, బిడ్డను చూసుకుంటూ ఉండేవాడు. 

ఇదిలా ఉండగా సోమవారం రాత్రి బాల్ రెడ్డి బాగా మద్యం సేవించి వచ్చాడు. మద్యం మత్తులో లక్ష్మిని చితకబాది పసికందును లాక్కొని పైకి ఎత్తి కిందపడేసి పాల డబ్బాను నోట్లో కుక్కాడు. దీంతో ఊపిరి ఆడక పసిబిడ్డ మృత్యుఒడికి చేరింది. 

కళ్లెదుటే బిడ్డను చంపటంతో లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఉదయం శిశివు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు బాల్‌రెడ్డి శ్మశానవాటిక వైపు వెళ్తుండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. 

నందికొట్కూరురూరల్‌ సీఐ ప్రసాదు, ఎస్‌ఐ తిరుపాలు సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారించారు. శిశువు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లికి అప్పగించారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu