రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌తో నారా లోకేష్ భేటీ..

Published : Sep 26, 2023, 04:16 PM ISTUpdated : Sep 26, 2023, 04:28 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌తో నారా లోకేష్ భేటీ..

సారాంశం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లోకేష్‌తో పాటు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు,  కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని వారు.. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై కూడా రాష్ట్రపతికి లోకేష్ వివరించినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీకి వెళ్లిన లోకేష్.. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రస్తుం అక్కడే ఉండి చంద్రబాబు కేసు విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలపై ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu