తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై ఫైర్ అయ్యారు. కేవలం బొత్సాపైనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బొత్సా సత్యనారాయణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయితే తాజాగా ఎమ్మెల్యే బొత్సా సత్యనారాయణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలు, బడ్జెట్, ల్యాండ్ పూలింగ్ వంటి విషయాలపై తెదేపా నాయకులపై సంచలనం వ్యాఖ్యలు చేశారు. అలాగే, హ్యాపీ నెస్ట్ సంస్థకు రివర్స్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయంపై నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా "ఇన్ని రోజులూ ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా... అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. అయినా బొత్సాగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు." అంటూ బొత్సా సత్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
undefined
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ముగ్గురు టీడీపీ నేతలకు నోటీసులు
అయినా తాము అమరావతిని నిర్మించడానికి పడిన కష్టం వైకాపా నేతలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. అంతేగాక ఈ విషయాన్ని ఉద్దేశించి "ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు." అంటూ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి ఈ వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
జగన్ మావాడే అని నేననుకుంటున్నా, ఆయన కాదు: బీజేపీ నేత వద్ద టీడీపీ మాజీ ఎంపీ ఆవేదన
అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పార్టీలోని పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీంతో మరి కొందరు కూడా పార్టీ మారే ఆలోచనలో పడినట్లు సమాచారం.
I think Botsa Satyanarayana is on dope available near Tadepalli right under the nose of . Or else, why would he make shocking comments comparing Amaravati with a graveyard? Who would stoop to such a low and disrespect the farmers who’ve pooled their lands? (1/2) pic.twitter.com/dUlhJiDqrj
— Lokesh Nara (@naralokesh)ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా. అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న గారు అక్కడే ఆగిపోతారని ఊహించలేదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు. (1/3) pic.twitter.com/A5EoIvqbdE
— Lokesh Nara (@naralokesh)