బాదుడే బాదుడు ఫేజ్ 2.. ఈసారి రూ.500 కోట్లు టార్గెట్, ఆందుకే ఆర్టీసీ ఛార్జీలు పెంపు: లోకేష్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 1, 2022, 3:01 PM IST
Highlights

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రెండో విడత బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈసారి పేదల నుంచి రూ.500 కోట్లు దోచుకోవాలనే జగన్ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై (ys jagan) మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) . తాజాగా ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసించిన లోకేష్.. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేవంటూ దుయ్యబట్టారు. రెండు నెలలు తిరక్కముందే డీజిల్ సెస్ పేరు చెప్పి మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని లోకేష్ మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై భారం మోపడమేనని ఆయన ఎద్దేవా చేశారు. 

రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ. 500 కోట్లను ప్రజల నుంచి జగన్ ప్రభుత్వం కొట్టేయనుందని నారా లోకేష్ ఆరోపించారు. చివరికి పిల్లల బస్సు పాసులను కూడా వదలడం లేదంటూ చురకలంటించారు. తక్షణం ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేసేలా వ్యవహరిస్తున్నారని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తున్నారని ఫైరయ్యారు. 

ALso Read:ఏపీలో బస్సు ఛార్జీల పెంపు.. రేపటి నుంచే అమల్లోకి, ఏయే బస్సుల్లో ఎంతంటే..?

కాగా.. ఇవాళ్టీ నుంచి బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. డీజిల్‌ సెస్‌ పెంపు కారణంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. అయితే ఈ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇకపోతే.. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై ప్రస్తుతం రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70.. హైదరాబాద్ వెళ్లే అమరావతి ఏసీ బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్‌ సెస్‌ పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 

పల్లె వెలుగు బస్సుల్లో.. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. అయితే తొలి 30 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంపు లేదు. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్‌ వసూలు చేస్తారు.  60 నుంచి 70 కి.మీ వరకు రూ.10...100 కి.మీ ఆపైన రూ.120 సెస్‌ విధించారు. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5లు సెస్ కింద వసూలు చేస్తున్నారు. కానీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్‌ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 ..66 నుంచి 80కి.మీ వరకు  రూ.10ను సెస్ కింద వసూలు చేయనున్నారు. 

click me!