నారా కంటే సారా అయితే బెటర్: ఏపీ అసెంబ్లీలో బాబుపై జగన్

By narsimha lode  |  First Published Mar 23, 2022, 4:57 PM IST

రాష్ట్రంలో తమ ప్రభుత్వం మద్యానికి సంబంధించి ఒక్క కొత్త బ్రాండ్ కు కూడా అనుమతి ఇవ్వలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు.


అమరావతి: 2019 తర్వాత రాష్ట్రంలో ఒక్క బ్రాండ్ కు కూడా అనుమతి ఇవ్వలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్ప కాలిక చర్చ బుధవారం నాడు జరిగింది.ఈ చర్చలో సీఎం జగన్ ప్రసంగించారు.  రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు అనుమతిచ్చిన పాపం Chandrababuదేనని సీఎం YS Jaganచెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అపద్ధర్మ సీఎంగా ఉన్న కాలంలో కూడా కొత్త బ్రాండ్లకు చంద్రబాబు అనుమతిని ఇచ్చారని సీఎం జగన్ గుర్తు చేశారు. 

ఏపీలో చీప్ లిక్కర్ లేదని ఆయన స్పష్టం చేశారు. త్రీ కాపిటల్స్, స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్లు ఉన్నాయని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు.  చంద్రబాబు నాయుడు సర్కార్ పలు రకాల మద్యం బ్రాండ్లకు అనుమతిని ఇచ్చిన విషయాన్ని సీఎం AP Assembly లో ప్రకటించారు. గవర్నర్ చాయిస్ కు 2018 నవంబర్ 5న అనుమతిచ్చారనన్నారు. 2019 తర్వాత తమ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీ గానీ, ఒక్క బ్రేవరేజేస్ గానీ అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం విక్రయిస్తున్న బ్రాండ్లన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టినవేనన్నారు. దత్త పుత్రుడు, బావ మరిది పేరును కూడా బ్రాండ్లను  తీసుకొచ్చారని జగన్ సెటైర్లు వేశారు. లెజెండ్, పవర్ స్టార్ 999  పేర్లతో బ్రాండ్లు తీసుకొచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.

Latest Videos

undefined

అంతేకాదు భూం భూం,రష్యన్ రోమనోవా వంటి బ్రాండ్లు కూడా చంద్రబాబు సర్కార్ తెచ్చినవేనన్నారు. చంద్రబాబు హయంలో 254 రకాలల liquor బ్రాండ్లు తీసుకొచ్చారని చెప్పారు. 

నవరత్నాలు, దిశ, అమ్మఒడి మన బ్రాండ్లు అని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం 16 మెడికల్ కాలేజాీలకు అనుమతిస్తే చంద్రబాబు సర్కార్ 14 డిస్టిలరీలకు అనుమతిని ఇచ్చిందన్నారు.చంద్రబాబు ఇంటి పేరు నారా కంటే సారా అంటే బాగా సూట్ అవుతుందని జగన్ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు వారి ప్రభుత్వ హయంలోనే ఈ బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన విషయం గుర్తు లేదా అని సీఎం ప్రశ్నించారు.

చంద్రబాబు హయంలో ఈ బ్రాండ్లు హెల్త్ డ్రింక్స్ , ఇప్పుడేమో హానికరమైన మద్యమా అని జగన్ నిలదీశారు.Jangareddygudem మరణాలపై టీడీపీ నేతలు తప్పుదు ప్రచారం చేస్తున్నారని జగన్ మండి పడ్డారు. వీళ్లవి క్రిమినల్ బ్రెయిన్స్ అన్నారు. వీళ్లను జూలో పెట్టాలని జగన్ చెప్పారు.

డిస్టిలరీలు, బ్రేవరేజీస్ ఎవరివని జగన్ ప్రశ్నించారు.జ ఎస్పీవై డిస్టిలరీ ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఎస్సీవై  రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడని జగన్ ప్రశ్నించారు. విశాఖ డిస్టిలరీ  మాజీ మంత్రి Ayyannapatruduది కాదా అని జగన్ ప్రశ్నించారు.

గత ఏడాది ఈ డిస్టిలరీని అయ్యన్నపాత్రుడి విక్రయించినట్టుగా చెబుతున్నారన్నారు. అయితే విక్రయించే వరకు ఈ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదేనా కాదా అని సీఎం అడిగారు. పీఎంకే డిస్టిలరీస్ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా అని జగన్ ప్రశ్నించారు. శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవులనాయుడిది కాదా అని అడిగారు.రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించేందుకు  చంద్రబాబు పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేస్తుందన్నారు. 

మద్యం విక్రయాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ధరలు పెంచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.  మద్యం ఏది తాగినా కూడా ప్రమాదమేనన్నారు. తమ ప్రభుత్వం నాటుసారాపై కఠినంగా వ్యవహరించామన్నారు. దీంతోనే తమ ప్రభుత్వం 14.2 లక్షల లీటర్ల సారాను సీజ్ చేశామన్నారు. తమ ప్రభుత్వం 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేసిందన్నారు. అంతేకాదు  4 వేల మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్ రూమ్ లను కూడా ఎత్తివేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

click me!